Axar Patel: ఆకాశమే హద్దుగా చెలరేగిన అక్షర్ పటేల్..17 ఏళ్ల రికార్డు బద్దలు..!
Axar Patel: వెస్టిండీస్ గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు.
Axar Patel: విండీస్‌లో యువ భారత్ అదరగొడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగుర వేసింది. దీంతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఖాతాలో చేరింది. రెండో వన్డేలో భారత ఆలౌరౌండర్ అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన అతడు..బ్యాటింగ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. కేవలం 35 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
అక్షర్ పటేల్ బ్యాటింగ్‌తో భారత్ రెండు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈక్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 17 ఏళ్ల నాటి ధోని రికార్డును అధిగమించాడు. వన్డేల్లో లక్ష్య చేధనలో విజయవంతమైన జట్టు తరపు 7 లేదా అంతకంటే ముందు స్థానంలో వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. రెండో వన్డేలో 5 భారీ సిక్సర్లు బాదాడు. గతంలో 2005లో జింబాబ్వేపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడు సిక్సర్లు బాదాడు.
ఈరికార్డును తాజాగా అక్షర్ పటేల్ బద్దలు కొట్టాడు. టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ సైతం 2011లో మూడు సిక్సర్లు బాది ధోనీ రికార్డును సమం చేశాడు. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. మరోవైపు వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఈమ్యాచ్‌లో చివరి ఓవర్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇటు రెండో వన్డేలో భారత్ చివరి 10 ఓవర్లలో వంద పరుగుల చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Also read:Minister Harish Rao: ఇకపై ఇంటింటికి బూస్టర్ డోస్ పంపిణీ..మంత్రి హరీష్‌రావు కీలక రివ్యూ..!
Also read:Shiv Sena: ఈసీని నిలువరించండి..సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్దవ్ ఠాక్రే వర్గం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.