Shubman Gill: శుభ్‌మన్ గిల్‌పై సర్వత్రా ప్రశంసలు..తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్ధలు..!
Shubman Gill: జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌లో యువ భారత్ ఆకట్టుకుంది. ఈక్రమంలోనే టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సృష్టించాడు.
Shubman Gill: ఇటీవల భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే గడ్డపై అద్భుత ఆటతీరును కనపరిచాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్‌గా 82 పరుగులు చేశాడు. రెండో వన్డేలో వన్ డౌన్‌లో బరిలోకి దిగి 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక మూడో వన్డేలో అందర్నీ అలరించాడు. సెంచరీతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 97 బంతుల్లో 130 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. దీంతో టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును అధికమించాడు. మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా అత్యంత చిన్న వయస్సులో జింబాబ్వేపై ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 22 ఏళ్ల 348 రోజుల వయస్సులో ఈఫీట్‌ను గిల్ అందుకున్నాడు.
దీంతో రోహిత్ రికార్డు బద్ధలైంది. అతడు 23 ఏళ్ల 28 రోజుల వయస్సులో జింబాబ్వేపై సెంచరీ చేశాడు. మొత్తంగా విదేశీ గడ్డపై చిన్న వయస్సులో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. యువరాజ్ 22 ఏళ్ల 41 రోజులతో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 22 ఏళ్ల 315 రోజుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత స్థానంలో శుభ్‌మన్ గిల్ నిలిచాడు. జింబాబ్వే మ్యాచ్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీ చేయడంతో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.
అద్భుత ఆటతీరును కనబరుస్తున్న గిల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా భారత మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. చిన్న వయస్సులో 100..వెల్ డన్ శుభ్‌మన్ గిల్ అంటూ ట్వీట్ చేశాడు. ఇటు విదేశీ ఆటగాళ్లు సైతం గిల్‌ను అభినందిస్తున్నారు. మొత్తంగా జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. తొలి వన్డేల్లో సులువుగా గెలిచిన భారత్..చివరి మ్యాచ్‌లో చెమటోడ్చింది. సికిందర్ రజా సెంచరీతో ఆ జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు.
ఐతే చివర్లో అతడు ఔట్ కావడంతో జింబాబ్వేకి ఓటమి తప్పలేదు. ఈమ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. అద్భుత సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సిరీస్‌లో అలరించిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. త్వరలో దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2022 మొదలు కానుంది. శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.
Also read:Bandi Sanjay: లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉంది..వెంటనే సస్పెండ్ చేయాలన్న బండి సంజయ్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి