Virat Kohli on Records: ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా ఒక్క ఓటమి లేకుండా సెమీస్‌కు చేరుకుంది. కచ్చితంగా ఈసారి టైటిల్ గెలుస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీపై కూడా పెద్దఎత్తున ఆశలు ఉన్నాయి. సచిన్ మూడు రికార్డులకు చేరువలో ఉన్న కోహ్లీ..ఆ ఫీట్ సాధిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023లో మంచి ఫామ్‌లో ఉండి ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు విరాట్ కోహ్లి. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఏడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చూపించాడు. అంటే ఏడు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 594 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువలో నిలిచాడు. ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ పేరిట ఉంది. 2003లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఆ రికార్డుకు 79 పరుగుల దూరంలో ఉన్నాడు. 


దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాధించిన సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును 49 సెంచరీలతో సమం చేశాడు. ఇప్పుడు మరో సెంచరీ సాధిస్తే సచిన్ రికార్డు బద్దలు కొట్టగలడు.


మరోవైపు ఈ ప్రపంచకప్‌లో ఏడుసార్లు 50 దాటి స్కోర్ చేసిన విరాట్ కోహ్లీ ఈ ఘనత సాదించిన సచిన్ టెండూల్కర్, షకీబుల్ హసన్ రికార్డుల్ని సమం చేశాడు. ఇప్పుడు మరో హాఫ్ సెంచరీ చేస్తే ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ అవుతాడు. 


ఈ ప్రపంచకప్‌లో ఈ మూడు రికార్డుల్ని విరాట్ కోహ్లీ బద్దలు కొడతాడనే అంచనాలు పెరుగుతున్నాయి. ఒక్క సెంచరీ సాధిస్తే చాలు మొత్తం మూడు రికార్డులు సచిన్ నుంచి విరాట్ కోహ్లీ పేరిట వచ్చేస్తాయి. 


Also read: Actress Nude Offer: మరో పూనమ్ పాండే, ఇండియా ప్రపంచకప్ గెలిస్తే ఆ బీచ్‌లో నగ్నంగా తిరుగుతా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook