COVISHIELD Vaccine: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. క్రికెట్ అభిమానులు సైతం కోవిడ్-19 టీకాలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే భారత క్రికెటర్లు ఒకే రకం టీకాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ కోసం సన్నద్ధమవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 11వ తేదీన టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా సైతం కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. మే 10న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ ఇషాంత్ శర్మ, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తొలి డోసుగా కోవిషిల్డ్ టీకా తీసుకోవడం తెలిసిందే గత వారం ఓపెనర్ శిఖర్ ధావన్, అజింక్య రహానే, ఉమేష్ యాదవ్ కరోనాపై పోరాటంలో భాగంగా తొలి డోసు వ్యాక్సిన్‌గా కోవిషీల్డ్ టీకాను తీసుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌కు వెళ్లనున్న భారత క్రికెటర్లు(Team India) మాత్రమే కోవిషీల్డ్ టీకాలు తీసుకుంటున్నారని, కోవాగ్జిన్ టీకాలు ఎవరూ తీసుకోవడం లేదని సమాచారం.


Also Read: IPL 2021 తదుపరి మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ దూరం, స్పష్టం చేసిన ఇంగ్లాండ్ బోర్డు


టీమిండియా క్రికెటర్లు ముఖ్యంగా ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనున్న ఆటగాళ్లు కోవిషీల్డ్ టీకాలు మాత్రమే తీసుకోవడంపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడారు. ఒక వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుంటే, ఆ తరువాత 28 రోజుల గడువు తరువాత రెండో డోసు టీకా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌కు పయనం కానున్న 24 మంది క్రికెటర్లు కోవిషీల్డ్ టీకా తీసుకున్నారు. జూన్ ప్రారంభంలో వీరు యూకేకు వెళ్లనున్నారు. 


కరోనా టీకా రెండో డోసు తీసుకునే సమయంలో టీమిండియా క్రికెటర్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటారు. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్(Covishield Vaccine) యూకేలో ఆటగాళ్లకు అందుబాటులో ఉంటుంది. కనుక రెండో డోసు తీసుకునే సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని భావించి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లను కోవిషీల్డ్ తీసుకోవాలని బీసీసీఐ సూచించినట్లు తెలిపారు. 


Also Read: Telanganaలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్, మద్యం అమ్మకాలకు ఓకే


వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ యూకేలోని సౌతాంప్టన్‌లో జరగనుందని తెలిసిందే. జూన్ 18న ఆ టెస్ట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తరువాత ఆగస్టు 4న నాటింగ్‌హామ్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ క్రిష్న, అవేష్ ఖాన్, అర్జన్ నాగ్‌వస్వల్లాలను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లకు అదనపు ఆటగాళ్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. 


Also Read: COVID-19 విషాదం, కరోనాతో టీమిండియా క్రికెటర్ Piyush Chawla తండ్రి కన్నుమూత 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook