ICC T20 World Cup 2021 నుంచి టీమ్ ఇండియా నిష్క్రమణపై ప్రముఖ కికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెటర్లు, బీసీసీఐలను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021) నుంచి టీమ్ ఇండియా(Team India) నిష్క్రమించింది. చివరి మూడు మ్యాచ్‌లలో అద్భుత విజయం సాధించినా తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలవడం, ముఖ్యంగా ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఓడిపోవడంతో టీమ్ ఇండియాపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. టీమ్ ఇండియా నిష్క్రమణపై స్పందించిన కపిల్‌దేవ్ బీసీసీఐ, టీమ్ ఇండియా క్రికెటర్లను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఐపీఎల్(IPL) మాత్రమే ముఖ్యమనుకునేవాళ్లు దేశం కోసం ఏం అడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చి దేశాన్ని విస్మరించేవాళ్లకు ఏమీ చెప్పలేమని అసహనం వ్యక్తం చేశాడు కపిల్‌దేవ్.


దేశం తరపున ఆడటాన్ని క్రికెటర్లు ఎప్పుడూ ఓ గౌరవంగా భావించాలని హితవు పలికాడు. టిమ్ ఇండియాకు ఆడాలనుకునేవారు ఐపీఎల్ వంటి టోర్నీలు ఆడకపోవడమే మంచిదని కపిల్‌దేవ్(Kapil dev) అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా వైఫల్యానికి తీరిక లేని షెడ్యూల్ ప్రధాన కారణమనే విమర్శల నేపధ్యంలో కపిల్‌దేవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న టీమిండియా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.సెమీస్ చేరాలంటే అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో అఫ్గాన్ ఏదైనా అద్భుతం చేయాలని ఆశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ అద్భుతం జరగకపోవడంతో టీమిండియా(Team india)టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో టీమిండియా నాకౌట్‌ దశకు చేరకపోవడం ఇది తొలిసారి. 


Also read: India vs Namibia: నమీబియాపై టీమ్ ఇండియా ఘన విజయం- కెప్టెన్​గా ముగిసిన కోహ్లీ శకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook