India vs Namibia: నమీబియాపై టీమ్ ఇండియా ఘన విజయం- కెప్టెన్​గా ముగిసిన కోహ్లీ శకం

India Beat Namibia: టీ20 వరల్డ్ కప్​లో చివరి మ్యాచ్​ను విజయంతో ముగించింది టీమ్ ఇండియా. నమీబియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్​ను 9 వికెట్ల తేడాతో ముగించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 11:13 PM IST
  • నమీబియాపై టీమ్ ఇండియా ఘన విజయం
  • గెలిచినా టీ20 వరల్డ్​ కప్​ నుంచి వైదొలగిన భారత్​
  • టీ20ల్లో కెప్టెన్​గా ముగిసిన విరాట్ కోహ్లీ శకం
India vs Namibia: నమీబియాపై టీమ్ ఇండియా ఘన విజయం- కెప్టెన్​గా ముగిసిన కోహ్లీ శకం

India vs Namibia: టీ20 వరల్డ్ కప్​లో భాగంగా నమీబియాతో జరిగిన నామమాత్రపు (T20 World Cup 2021) మ్యాచ్​లో టీమ్ ఇండియా విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో చివరి మ్యాచ్​ను విజయంతో ముగించింది (India vs Namibia) టీమ్ ఇండియా. బౌలర్లు, బ్యాటర్లు సమష్ఠిగా కృషి చేసి విజయాన్ని అందించారు.

టాస్​ గెలిచి ఫీల్డింగ్​..

టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా. తొలిత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు.. భారత బౌలర్ల ధాటికి తడపడింది. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోలక్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలగింది. దీనితో టీమి ఇండియా ముందు స్వల్ప లక్ష్యం పెట్టింది నమీబియా.

47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్‌ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు.

భారతబౌలర్లు రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్​ 3, జస్​ప్రిత్ బుమ్రా 2 వికెట్లు తీశారు.

Also read: T20 World Cup 2021: విరాట్ కోహ్లీ తరువాత టీమ్ ఇండియా సారధ్యం ఎవరు

ఇద్దరు అర్ధ శతకాలు..

తరువాత బ్యాంటింగ్​కు దిగిన టీమ్ ఇండియా బ్యాటర్లు సునాయాసంగా పరుగులు చేశారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ 56 పరుగులకు.. నమీబియా బౌలర్‌ ఫ్రైలింక్‌ చేతిలో ఔటయ్యాడు. తొలి వికెట్ పడే సమయానికి ఇండియా స్కోరు 86. అనంతరం సూర్యకుమార్ యాదవ్​ బ్యాటింగ్​కు వచ్చి.. పరుగుల వేగాన్ని కొనసాగించాడు. దీనితో 15.2 ఓవర్లలోనే టీమ్ ఇండియా విజయం సాధించగలిగింది. కేఎల్​ రాహుల్ (KL Rahul) 35 బంతుల్లో 50 పరుగులు, సూర్యకుమార్ యాదవ్​ (Surya kumar Yadav) 18 బందుల్లో 25 పరుగులు చేశారు.

చివరి మ్యాచ్​లో విజయం సాధించినప్పటికీ.. టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది (Team India Out From T20 worldcup race) టీమ్ ఇండియా. పాకిస్థాన్, న్యూజిలాండ్​తో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత ఆఫ్గానిస్థాన్, స్కాట్లాండ్​, నేడు నమీబియాపై టీమ్ ఇండియా విజయం సాధించినా ఉపయోగం లేకుండా పోయింది.

Also read: Virat Kohli: టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రయాణం విజయవంతమా, విఫలమా

Also read: NZ vs AFG: అఫ్గానిస్థాన్​పై న్యూజిలాండ్ ఘన విజయం- భారత్​ సెమీస్​ అవకాశాలకు గండి

కెప్టెన్సీకు కోహ్లీ గుడ్​బై..

టీ20 జట్టు కెప్టెన్​గా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్​. టోర్నీ నుంచి వైదొలగినా.. చివరి మ్యాచ్​లో విజయంతో కెప్టెన్సీని వీడుతున్నాడు కోహ్లీ. మరోవైపు టీమ్ (Kohli says Goodbye to T20 Captaincy) ఇండియా హెడ్​ కోచ్​ రవి శాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్​. రవి శాస్త్రీ స్థానంలో ఇప్పటికే రాహుల్ ద్రవిడ్​ను హెడ్​ కోచ్​గా ఎంపిక చేసింది బీసీసీఐ, తరువాతి కెప్టెన్ ఎవరనే దానిపై మాత్రం ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Also read: Ashish Nehra: 'టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్​కు అర్హతలున్నాయ్'

Also read: National Cricket Academy Director: ద్రవిడ్ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News