Shreyas Iyer: టీమ్ ఇండియాలో స్థానం దక్కడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. లేకపోతే మరో వ్యక్తి  ఆ అవకాశాన్ని తన్నుకుపోగలడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇదే జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ ముగిసింది. ఇండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్ ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా భారీ విజయం సాధించింది. అయితే టీమ్ ఇండియాలో కీలకమైన ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్‌‌కు స్థానం దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్చపర్చింది. ఫామ్‌లో ఉన్నా సరే శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కలేదు. కొత్త సమీకరణాల నేపధ్యంలో మరో అయ్యర్ ఆ అవకాశాన్ని తన్నుకుపోయాడు. అంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా కాస్త ఉండాల్సిందే. 


వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టులో తీసుకోకపోవడంతో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అద్భుతమన ప్రతిభ ఉండటమే కాకుండా ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కనబెట్టడంలో అర్ధమేంటని ప్రశ్నలు విన్పించాయి. శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జట్టులో వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని మరో అయ్యర్ ఆక్రమించాడు. దీనిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సమాధానమిచ్చాడు.


రోహిత్ శర్మ ఏమన్నాడంటే..


శ్రేయస్ అయ్యర్ వంటి కీలకమైన ఆటగాడిని పక్కనబెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే అయ్యర్‌కు ఫైనల్ టీమ్‌లో చోటు లభించలేదు. మాకు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే ఆటగాడు కావల్సి ఉంది. అందుకే శ్రేయస్‌కు స్థానం లభించలేదు. జట్టులో ఈ స్థానానికి తీవ్రమైన పోటీ ఉంది. వాస్తవానికి ఇది మంచి పరిణామమే. ఫామ్‌లో లేని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం కంటే..ఇలా పోటీ ఉండటం మంచిదే. త్వరలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అయ్యర్‌తో కూడా చర్చించాం. జట్టు అవసరం మేరకు తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నాం.


రోహిత్ శర్మ చెప్పినట్టు...మిడిల్ ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్థానంలో వెంకటేశ్ అయ్యర్ నిలదొక్కుకుని..తన బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో తన ప్రతిభ చాటుకుంటే ఇక శ్రేయస్‌కు స్థానం గగనమేనా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. రోహిత్ శర్మ చెప్పినదాని ప్రకారం వెంకటేశ్ అయ్యర్ ఫామ్‌లో లేకుంటేనే శ్రేయస్‌కు స్థానం రావచ్చేమో. లేదా మరో ఆల్ రౌండర్ కోసం వెతికే అవకాశాలున్నాయి.


Also read: టీమిండియా స్టార్ బౌలర్‌కు వార్నింగ్.. ఇక ఆడకుంటే అంతేసంగతులు అన్న బీసీసీఐ! ఇషాంత్‌, ఉమేష్ మాదిరే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook