టీమిండియా స్టార్ బౌలర్‌కు వార్నింగ్.. ఇక ఆడకుంటే అంతేసంగతులు అన్న బీసీసీఐ! ఇషాంత్‌, ఉమేష్ మాదిరే!

BCCI warns Bhuvneshwar Kumar: ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాణించకుంటే.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందిని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 06:45 PM IST
  • 4 ఓవర్లలో 31 పరుగులు
  • టీమిండియా స్టార్ బౌలర్‌కు బీసీసీఐ వార్నింగ్
  • ఇక ఆడకుంటే అంతేసంగతులు
 టీమిండియా స్టార్ బౌలర్‌కు వార్నింగ్.. ఇక ఆడకుంటే అంతేసంగతులు అన్న బీసీసీఐ! ఇషాంత్‌, ఉమేష్ మాదిరే!

BCCI warns Bhuvneshwar Kumar: భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఇటీవలి కాలంలో చోటు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్,  చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహాలు చోటు కోల్పయి జట్టుకు దాదాపుగా దూరమయ్యారు. ఈ జాబితాలో స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా చేరే అవకాశం ఉంది. సరిగా ఆడకుంటే జట్టులో చోటు ఉండదు అని బీసీసీఐ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువీ రాణించకుంటే.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే ఆఖరి ఛాన్స్ అని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది.

స్వింగ్‌ బౌలర్‌, డెత్‌ ఓవర్ల స్పెషలిస్టగా పేరు గాంచిన భువనేశ్వర్ కుమార్ గత కొంత కాలంగా సరైన ప్రదర్శన చేయడం లేదు. గత మూడేళ్లగా గాయాల బారిన పడుతున్న భువీ.. పూర్తిగా టెస్టులకు దూరం అయిన విషయం తెలిసిందే. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా అడపాదడపా ఆడుతున్నాడు. ఒకవైపు ఫామ్ కోల్పోవడం, మరోవైపు కుర్రాళ్లు జట్టులోకి రావడంతో మనోడికి చోటు దక్కడం కష్టంగా మారింది. అయితే అదృష్టవశాత్తు వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. 

తొలి టీ20లో భువనేశ్వర్‌ కుమార్ తన కోటా 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. ఈ ప్రదర్శన అందరిని నిరాశపరిచింది. రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ లాంటి యువ బౌలర్లు 20 లోపు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొడితే.. భువీ మాత్రం ఏకంగా 31 రన్స్ సమర్పించుకున్నాడు. మిగిలిన రెండు మ్యాచులలో సరైన ప్రదర్శన చేయకపోతే.. భువనేశ్వర్‌ పని దాదాపుగా అయిపోయినట్టే. ప్రస్తుత పోటీ నేపథ్యంలో భవిష్యత్తులో టీమిండియాలోకి రావడం కష్టమవుతుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ పరోక్షంగా హెచ్చరించింది. 

'భువనేశ్వర్‌ కుమార్‌కు ఇది చివరి అవకాశం అని చెప్పొచ్చు. ఐపీఎల్‌ 2021 నుంచే భువీ గతంలోలా రాణించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటన అతనికి పెద్ద పీడకల. ఇప్పటికే యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ, భారత జట్టు మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. ఒకవేళ​ మొహ్మద్ షమీ తుది జట్టులోకి వస్తే..  అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. విండీస్‌తో టీ20 సిరీస్‌లో​ చేసే ప్రదర్శనపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. విఫలమైతే మాత్రం ఇషాంత్ శర్మ, చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానేల మాదిరే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంటుంది' అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. 

Also Read: IND vs WI: వైడ్ ఇచ్చిన అంపైర్.. డీఆర్‌ఎస్ కోరిన రోహిత్ శర్మ! ఆ తర్వాత ఏమైందంటే? (వీడియో)

Also Read: Bheemla Nayak OTT: 'భీమ్లా నాయక్' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News