ICC ODI Rankings 2023: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ దుమ్మురేపాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపరచుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. 694 పాయింట్లు సాధించిన సిరాజ్ ఆస్ట్రేలియా బౌలర్‌ జాష్ హేజిల్‌వుడ్‌ను వెనక్కి నెట్టి నెంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు. హేజిల్‌వుడ్‌ 678 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్ పేసర్ బౌలర్‌ బౌల్ట్‌ 677 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో అఫ్గాన్ స్పిన్ ద్వయం  ముజీజ్‌ ఉర్‌ రెహ్మాన్‌, రషీద్‌ ఖాన్‌ కొనసాగుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్క మ్యాచ్ మార్చేసింది..
ఆసియా కప్ ఫైనల్ కు ముందు సిరాజ్ తొమ్మిదో ర్యాంకులో ఉండేవాడు.  ఒక్క మ్యాచ్ అతడి స్థానాన్ని మార్చేసింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ ఫైట్ లో సిరాజ్ చెలరేగి ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. ఒకే ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. దీంతో 643 పాయింట్లతో ఉన్న సిరాజ్ ఈ మ్యాచ్ ద్వారా 51 రేటింగ్ పాయంట్లు సంపాదించి ఏకంగా టాప్ ప్లేస్ కు దూసుకెళ్లాడు. అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం సిరాజ్ కు ఇది రెండో సారి. 


రెండో స్థానంలోనే శుభమన్ గిల్
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో పెద్ద మార్పులు లేవనే చెప్పాలి. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ 857 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ 814 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ ఎనిమిది, కెప్టెన్ రోహిత్ శర్మ పదో స్థానంలోనూ ఉన్నారు.  


Also Read: ODI World Cup Song: వన్డే వరల్డ్ కప్ సాంగ్ వచ్చేసింది.. మీరు చూసేయండి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook