Virat Kohli Shares Workout Video: టీమిండియా స్టార్ ఇండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్‌కు రెడీ అవుతున్నాడు. ఇటీవల విండీస్‌లో టెస్టు సిరీస్‌తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. తొలి వన్డే అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నాడు. మళ్లీ తాజాగా క్రికెట్‌ మూడ్‌లోకి వచ్చేశాడు. టోర్నీకి ముందు జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్న వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఆసియా కప్ 2023లో కోహ్లీ నేరుగా అడుగుపెట్టనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోహ్లీ షర్ట్ లేకుండా ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరుగెత్తాడు. కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు క్యాప్షన్ ఇస్తూ.. "ఇది సెలవుదినం, కానీ ఇంకా పరుగెత్తాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జట్టులో అందరి కంటే ఎక్కువ ఫిట్‌గా ఉండే ప్లేయర్లలో కోహ్లీనే ముందుంటాడు. నిత్య జిమ్‌లో కష్టపడుతూ.. సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు తనకు తాను మెరుగులు దిద్దుకుంటాడు. 34 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడి మాదిరే పాదరసంలా గ్రౌండ్‌లో కదులుతుంటాడు.


 




ఆసియా కప్‌కు టీమిండియాను ఇంకా ప్రకటించలేదు. టోరీకి ముందే చాలా మంది ఆటగాళ్లు తమ సన్నద్ధతను ప్రారంభించారు. హైబ్రిడ్ మోడల్‌ను ఆసియా కప్ జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, భారత్‌ అన్ని మ్యాచ్‌లతో కలిపి మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్ ఏలో టీమిండియా, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఆగస్టు 30న ఆసియా కప్‌లో ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబరు 2న క్యాండీలో పాకిస్థాన్‌తో భారత్ తొలిపోరులో తలపడనుంది. సెప్టెంబరు 4న నేపాల్‌తో అదే వేదికపై గ్రూప్‌లో రెండో మ్యాచ్‌ ఆడనుంది. రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు సూపర్-4లోకి వెళ్తాయి. ఆ తర్వాత సూపర్-4లో తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.


 


Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్   


Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook