టీమిండియా యూనిఫాం అనగానే ఎవరైనా బ్లూ కలర్ ఎవరైనా టక్కున చెప్పాస్తారు.  నీలిరంగ ప్రభావం ఎంత ఉందంటే... భారత జట్టుపై మెన్ ఇన్ బ్లూ అనే ముద్రపడింది. అయితే ఈ సారి వరల్డ్ కప్ లో మాత్రం సరికొత్త యూనిఫాం ధరించి టీమిండియా బరిలోకి దిగనుందట.తొలిసారిగా భారత క్రికెటర్లు మరో రంగు దుస్తుల్లో కనువిందు చేయనున్నారు.ఎప్పటిలా నీలిరంగు జెర్సీ స్థానంలో కాకుండా ఆరెంజ్ కలర్ ధరించనున్నారు. అయితే డిసైన్ ఏలా ఉంటుందనేది ఇకా తెలియరాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జెర్సీ ప్రస్తానం...


ప్రపంచకప్‌ 1996కు వెళ్లే ముందు టీమిండియా జెర్సీలో మరోసారి స్వల్ప మార్పులు జరిగాయి. 1994లో తీసుకొచ్చిన జెర్సీని అదే తరహాలో ఉంచుతూ ఛాతి భాగంలో పసుపు రంగు షేడ్‌నిచ్చింది. ఇప్పుడు ఏకంగా నిలి రంగనే పక్కనపెట్టి సరికొత్త రంగు కేటాయించడం గమనార్హం. మరి కాషాయ దుస్తుల్లో టీమిండియా ఎలా కనిపిస్తుందో చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


రేపే కోహ్లీసేన తొలి వన్డే...


ఇదిలా ఉండగా  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా రేపు తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో భారత జట్టు సౌతాంప్టన్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి వన్డేలో బంపర్ విక్టరీతో ప్రస్తానం మొదలెట్టాలని టీమిండియా భావిస్తుంటే...ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన సఫారీ జట్టు ఏ మ్యాచ్ లో ఎలాగైన గెలవాలనే ఒత్తిడిలో ఆడుతుంది.