శ్రీలంకలో వచ్చేనెల 6 నుంచి జరిగే టీ20 ట్రై సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది సెలక్షన్ కమిటీ. నేడు జరిగిన బీసీసీఐ సమావేశంలో భారతజట్టును ఖరారు చేశారు. ఊహించినట్టే కొహ్లీ, ధోనీలకు విశ్రాంతి ఇచ్చారు. వీరితో పాటు భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రాలకు కూడా రెస్టు ఇచ్చింది సెలక్షన్ కమిటీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోహిత్ శర్మ నేతృత్వంలో 15 మందితో టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. తొలిసారి వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ ఎంపికయ్యారు. దీపక్ హుడా, రిషబ్ పంత్ లతో పాటు యువకులైన విజయ్, మహమ్మద్ సిరాజ్ లకు జట్టులో అవకాశమిచ్చారు. మార్చి 18న సిరీస్ ముగుస్తుంది. ఇండియా, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ మూడో టీంగా ఉంది.


శ్రీలంకకు వెళ్లనున్న భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, మనీష్ పాండే, దినేష్ కార్తిక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, రిషభ్ పంత్