Shane Warne Death Report: ఆస్ట్రేలియన్ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మృతిపై థాయ్ పోలీసుల నివేదిక వెలువడింది. మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ ప్రసిద్ధ స్పిన్నర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌లోని విల్లాలో వార్న్ హఠాత్తుగా మరణించడంపై థాయ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్న్ మరణం వెనుక ఏమైనా ఇతర కారణాలున్నాయో లేదో తెలుసుకోవడమే థాయ్ పోలీసుల అనుమానం. దర్యాప్తు అనంతరం నివేదిక సమర్పించారు. విల్లాలో అచేతనంగా పడి ఉన్న షేన్‌వార్న్‌ను వెంటనే థాయ్ ఇంటర్నేషనల్ హాస్పటల్‌కు తరలించగా..అక్కడి వైద్యులు దాదాపు 20 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దర్యాప్తు అనంతరం థాయ్ పోలీసులు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.


షేన్‌వార్న్ కేవలం తీవ్రమైన గుండెపోటుతోనే మరణించినట్టు థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. అతడి మృతిలో ఏ విధమైన అనుమానాలు లేవని స్పష్టం చేశారు. వార్న్ ఏ విధమైన ఆల్కహాల్ గానీ. మత్తు పదార్ధాలు గానీ తీసుకోలేదు. హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. వాస్తవానికి థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయ్ ప్రాంతంలో ఉన్న తన విల్లాకు హాలిడే ఎంజాయ్ కోసం షేన్‌వార్న్ వెళ్లాడు. మరణించిన రోజు అందరూ కలిసి క్రికెట్ చూశారు. ఆ తరువాత సాయంత్రం సమయంలో ఒంటరిగా పడుకున్నాడు. రాత్రి భోజనం చేసేందుకు రమ్మని స్నేహితులు పిలిచేటప్పటికి స్పృహ కోల్పోయి ఉన్నాడు. అంత హఠాత్తుగా మరణించడంపై థాయ్ పోలీసులకు సందేహాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేశారు.


అటు షేన్‌వార్న్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వివిధ రూపాల్లో షేన్‌వార్న్‌కు నివాళులు అర్పిస్తున్నారు. కొందరైతే వార్న్‌కు ఇష్టమైన సిగరెట్, బీర్, మాంసాన్ని కూడా నివాళి అర్పిస్తూ చిత్రపటం వద్ద ఉంచుతున్నారు. అటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్..వార్న్ మృతిపై సంతాపం ప్రకటించారు. 


Also read: Ravindra Jadeja: 35 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook