Special Day For Team India: సెప్టెంబర్ 24 2007 టీమిండియాకు (Team India) ఒక స్పెషల్ డే గా చెప్పవచ్చు.. యువ ఆటగాళ్ల తో MS ధోనీ (MS Dhoni) అద్భుతమైన ఆట తీరుతో మొట్టమొదటి T-20 వరల్డ్ (T-20 World Cup)కప్ ను భారత్ కు అందించాడు.. అలనాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందామా..!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 సంవత్సరాల క్రితం ఇదే రోజున, ఎంఎస్ ధోనీ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో (South Africa) జరిగిన టి 20 ప్రపంచ కప్ (T-20 World Cup Tournament)టోర్నీలో విజయం సాధించింది. జోహన్నెస్‌బర్గ్‌లోని (Wanderers) వాండరర్స్‌లో (Johannesburg) భారత్- పాకిస్థాన్ (Inida Vs Pakisthan) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.


Also Read: PM Modi US Tour: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఆమె గెలుపు చారిత్రాత్మకం


గాయం కారణంగా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫలితంగా, యూసఫ్ పఠాన్ మరియు గౌతమ్ గంభీర్ (Yusuf Pathan and Gautam Gambhir) బ్యాటింగ్ ప్రారంభించారు. యూసుఫ్ పఠాన్ (15) ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టిన తరువాత మూడో ఓవర్లో పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ (Mohammad Asif), పఠాన్ ను పెవిలియన్‌కు పంపించాడు.


తరువాత వచ్చిన రాబిన్ ఉతప్ప (Robin Uthappa) (8) కూడా అవుట్ అవ్వగా.. ఫలితంగా, భారత్ 40/2 వద్ద తడబడింది. తరువాత వచ్చిన యువరాజ్ సింగ్- గౌతమ్ గంభీర్ జోడి (Yuvraj Singh- Gautam Gambhir), నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అయితే 14 వ ఓవర్‌లో యువరాజ్ (14) నిష్క్రమించిన తర్వాత నుండి మెన్ ఇన్ బ్లూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 




కానీ, ఈ సమయంలో గంభీర్ చక్కని ఆటతీరును కనబరచడంతో... కేవలం 54 బంతుల్లో 8 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. చివరికి, రోహిత్ శర్మ (Rohit Sharma)కేవలం 16 బంతుల్లో 30 పరుగుల చేయగా... టీమిండియా 20 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులకు చేరుకుంది. 


Also Read: Love Story Twitter Review: నాగ చైతన్య, సాయిపల్లవి యాక్టింగ్, డ్యాన్స్ ఇరగదీశారు..‘'లవ్ స్టోరీ'’మూవీ రివ్యూ


157 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ తడబడింది.. షాహిద్ అఫ్రిది (Shahid Afridi), యూనిస్ ఖాన్ (Younis Khan), షోయబ్ మాలిక్ (Shoaib Malik) వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్ లను టీమిండియా బౌలర్లు త్వరగా పెవిలియన్ కు పంపటంతో పాకిస్థాన్ 77 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. 


కానీ, పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ మిస్బా-ఉల్-హక్ (Misbah-ul-Haq) ఏ మాత్రం నిరాశ చెందకుండా పరుగులు చేస్తూ.. విజయానికి చాలా దగ్గరగా తీసుకొచ్చాడు. ఒకానొక దశలో పాకిస్థాన్ గెలుస్తుందేమో అన్న నిరాశ భారత అభిమానుల్లో మొదలైంది. ఇలా చివరి ఓవర్లో పాకిస్థాన్ గెలుపుకు కేవలం 13 పరుగులు మాత్రమే అవసరం. చివరి ఓవర్... ప్రపంచకప్ ఎవరిదా అనే నిర్ణయించే ఓవర్... ఎంఎస్ ధోనీ చివరి ఓవర్ వేయటానికి జోగిందర్ శర్మను (Joginder Sharma) ఎంచుకున్నాడు.


మిస్బా-ఉల్-హక్ చివరి ఓవర్ లో రెండో బంతిని సిక్సర్ గా మలిచాడు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు జల్లాడు. ఏదేమైనా, చివరి ఓవర్ మూడవ బంతిలో స్కూప్ షాట్ ఆడబోయి మిస్బా-ఉల్-హక్, శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చాడు..


Also Read: Insomnia: నిద్రలేమికి దూరంగా ఉండాలంటే ఇలా చేయండి మరి


ఆ వికెట్ తో ఫైనల్స్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచి ప్రతిష్టాత్మక టీ-20 కప్ ను సొంతం చేసుకొని చరిత్ర శృష్టించింది. ఈ గెలుపు తరువాత MS ధోనీ ICC ట్రోఫీ (ICC Trophie),  2011లో 50-50 వరల్డ్ కప్ (50-50 World Cup in 2011) మరియు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను (Champions Trophy) భారత్ కు అందించాడు. ఏంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించటంలో యావత్ భారత్ సంబరాల్లో మునిగిపోయింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి