Love Story Twitter Review: నాగ చైతన్య, సాయిపల్లవి యాక్టింగ్, డ్యాన్స్ ఇరగదీశారు..‘'లవ్ స్టోరీ'’మూవీ రివ్యూ

Love Story Twitter Review: నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం'లవ్​స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఎటు చూసినా..ఈ చిత్రం గురించే చర్చ నడుస్తోంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 12:45 PM IST
  • శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ'
  • నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా మూవీ
  • ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్
Love Story Twitter Review: నాగ చైతన్య, సాయిపల్లవి యాక్టింగ్, డ్యాన్స్ ఇరగదీశారు..‘'లవ్ స్టోరీ'’మూవీ రివ్యూ

Love Story Twitter Review: సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల(Shekar Kammula) సిద్ధహస్తుడు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే లవ్ స్టోరీ(Love story movie). గామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది . నేడు( 24న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్(Twitter) రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

Also Read: Krithi Shetty: ఉప్పెన కృతిశెట్టి పారితోషికం ఇప్పుడెంతో తెలుసా

సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలను ఈ మూవీలో బాగా చూపించారని టాక్‌ వినిపిస్తోంది. ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచి, సెకండాఫ్‌ వచ్చేసరికి సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారని నెటిజన్స్‌(Netizens‌) కామెంట్స్‌ చేస్తున్నారు. మొదటిసారి నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. అంతే కాదు ఈ సినిమాలో చైతన్య డాన్స్(Dance) లుకూడా ఇరగదీశారు. డాన్స్‌ల కోసం చైతన్య(Naga Chaitanya) చాలా కష్టపడ్డాడు. ఏదో సాదించడం కోసం హైదరాబాద్ వచ్చిన హీరో హీరోయిన్ పడ్డ కష్టాలను చూపిస్తూనే… వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమను…ఆ ప్రేమను పెళ్లిపీటలవరకు తీసుకెళ్లే క్రమంలో వారు ఎదురుకున్న కష్టాలను సినిమాలో చూపించారని తెలుస్తుంది. అలాగే సాయి పల్లవి(Sai pallavi) ఎప్పటిలానే తన నటనతో డ్యాన్స్ లతో ఆకట్టుకుంది. 

ప్రపంచవ్యాప్తంగా 900పైగా థియేటర్లలలో ఈ మూవీ విడుదలైంది. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా(Social Media) వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News