Tim Southee Creates World Record: పొట్టి క్రికెట్‌లో న్యూజిలాండ్ (Newzealand) స్టార్ పేసర్ టిమ్ సౌథీ(Tim Southee) చర‌త్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్ల తీసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్ లో 150 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా సౌథీ నిలిచాడు. పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి టీ20లో నాలుగు వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించాడు. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ మరియు ఆల్ రౌండర్ ష‌కీబుల్ హ‌స‌న్‌(Shakib Al Hasan) పేరిట ఉన్న  రికార్డును బద్దలుగొట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం షకీబ్ 140 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అప్ఘాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్‌(Rashid Khan) 130 వికెట్ల‌తో మూడో స్థానంలోనూ, కివీస్ స్పిన్న‌ర్ ఇష్ సోధీ(127 వికెట్లు), శ్రీ‌లంక దిగ్గ‌జం ల‌సిత్ మ‌లింగ‌(107), ఇంగ్లండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్(107), బంగ్లా పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(105), కివీస్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ శాంట్న‌ర్(105), పాకిస్థాన్ ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్(104), ఐర్లాండ్ బౌల‌ర్ మార్క్ అడైర్‌(102)లు టాప్ 10 బౌల‌ర్లుగా కొన‌సాగుతున్నారు. టాప్-10 జాబితాలో ఒక్క భార‌త బౌల‌ర్ కూడా లేక‌పోవ‌డం విశేషం.


ఆక్లాండ్‌లో పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి టీ20లో సౌథీ విజృంభించడంతో న్యూజిలాండ్ 46 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల న‌ష్టానికి 226 ప‌రుగులు చేసింది.ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్ (61 : 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు ) ఊచ‌కోతకు కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌(57 : 42 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలతో సత్తా చాటారు. అనంతరం లక్ష్య ఛేదనను ప్రారంభించిన పాక్ జట్టు కివీస్ బౌలర్లు ధాటికి కుప్పకూలింది. మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కివీస్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ నాలుగు, బెన్ సియ‌ర్స్ రెండు వికెట్లు తీశారు. 


Also Read: India vs England Test Series: ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. టీమ్‌లోకి కొత్త వికెట్ కీపర్ ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook