IPL 2022 Auction: ముగిసిన ఐపీఎల్ 2022 తొలిరోజు వేలం.. టాప్ 10లో ఎవరున్నారో తెలుసా?
IPL Auction 2022: ఐపీఎల్ 2022 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషాన్‌ను ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది. దీపక్ చహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రూ.14 కోట్లు ఖర్చు చేసింది.
Top 10 Highest Paid Cricketers List in IPL Auction 2022 Day 1: బెంగళూరు వేదికగా రెండు రోజులు సాగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ఐపీఎల్ 2022 వేలంలో కొందరి ఆటగాళ్లకు ఊహించని ధర పలకగా.. మరికొందరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ ధర పలికింది. ఇక కొందరు స్టార్ ఆటగాళ్లకు వేలంలో చుక్కెదురు కాగా.. అనామక ఆటగాళ్లకు భారీ ధర పలికింది. ఏదేమైనా వేలం మాత్రం రసవత్తరంగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది.
ఐపీఎల్ 2022 వేలంలో ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషాన్‌ను ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పోటీ ఇచ్చినా తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఐపీఎల్ 2022 వేలంలో ఇదే అత్యధిక ధర. టీమిండియా యువ పేసర్ దీపక్ చహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రూ.14 కోట్లు ఖర్చు చేసింది. ఇక భారత స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది.
మొత్తానికి ఐపీఎల్ 2022 వేలంలో అత్యధిక ధర పలికిన ముగ్గురు ప్లేయర్స్ భారత ఆటగాళ్లే కావడం విశేషం. ఇక టాప్ 10లో 6 ఆటగాళ్లు ఉండడం విశేషం. నికోలస్ పూరన్, వనిందు హసరంగా, లాకీ ఫెర్గూసన్, కగిసో రబాడాలు టాప్ 10లో ఉన్న విదేశీ ప్లేయర్స్. ఇందులో విండీస్ వికెట్ కీపర్ పూరన్‌కు భారీ ధర పలికింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పూరన్ కోసం 10 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించింది.
టాప్ 10 ప్లేయర్ల జాబితా ఇదే:
1. ఇషాన్ కిషన్ - ముంబై ఇండియన్స్ - రూ.15.25 కోట్లు
2. దీపక్ చహర్ - చెన్నై సూపర్ కింగ్స్ - రూ.14 కోట్లు
3. శ్రేయాస్ అయ్యర్ - కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 12.25 కోట్లు
4. నికోలస్ పూరన్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ.10.75 కోట్లు
5. శార్దూల్ ఠాకూర్ - ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 10.75 కోట్లు
6. వనిందు హసరంగా - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 10.75 కోట్లు
7. హర్షల్ పటేల్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 10.75 కోట్లు
8. లాకీ ఫెర్గూసన్ - గుజరాత్ టైటాన్స్ - రూ. 10 కోట్లు
9. ప్రసీద్ధ్ కృష్ణ - రాజస్థాన్ రాయల్స్ - రూ.10 కోట్లు
10. కగిసో రబాడా - పంజాబ్ కింగ్స్ - రూ.9.25 కోట్లు
Also Read: Baby AB Dewald Brevis: జూనియర్ డివిలియర్స్‌ను సొంతం చేసుకున్న ముంబై.. ఇక బౌలర్లకు చుక్కలే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook