Baby AB Dewald Brevis joins Mumbai Indians for 3 crore: అండర్ 19 ప్రపంచకప్ 2022 సంచలనం, దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ దేవల్ద్ బ్రేవిస్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భారీ ధర పలికింది. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. జూనియర్ డివిలియర్స్ దేవల్ద్ కనీస ధర రూ. 20 లక్షలు కాగా.. ప్రాంఛైజీలు పోటీ పడడంతో అతడికి జాక్ పాట్ దక్కింది. చిన్న వయసులోనే ప్రొటీస్ చిన్నోడికి రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం దక్కింది.
ఐపీఎల్ 2022 వేలంలో మొదటిగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు దేవల్ద్ బ్రేవిస్ కోసం పోటీపడ్డాయి. చెన్నై, పంజాబ్ మధ్య రసవత్తర పోరు నడుస్తుండగా.. చివరికి ముంబై ఇండియన్స్ వచ్చి ఎగరేసుకుపోయింది. ముంబై జట్టులో సచిన్ టెండూల్కర్, జయవర్ధనే లాంటి దిగ్గజాలు ఉండడంతో జూనియర్ డివిలియర్స్ నేర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తనకు నచ్చిన క్రికెటర్లు.
Young Dewald Brevis is SOLD to @mipaltan for INR 3 crore#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
ఇటీవల వెస్టిండీస్ వేదికగా ముగిసిన అండర్ 19 ప్రపంచకప్ 2022లో దేవల్ద్ బ్రేవిస్ అదరగొట్టిన విషయం తెలిసిందే. బౌలర్లను ఊచకోతకొస్తూ పరుగుల వరద పారించాడు. మెగా టోర్నమెంట్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 6 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో మొత్తంగా 506 పరుగులు చేశాడు. అయితే దక్షిణాఫ్రికా మాత్రం ఫైనల్ చేరలేకపోయింది. బ్రేవిస్ తప్ప మిగతావారు విఫలమవడంతో ప్రొటీస్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.
Also Read: Deepak Chahar: నక్కతోక తొక్కిన దీపక్ చహర్.. ఊహించని ధర పెట్టిన చెన్నై! ధోనీ కంటే ఎక్కువ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook