ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League ) 13 సీజన్ లో రెండో మ్యాచు కింగ్ ఎలెవన్ పంజాబ్, డిల్లీ క్యాపిటల్స్  (DC vs KXIP) టీమ్స్ ఇంతకు ముందు ఎన్నో సార్లు పోటీలోకి దిగాయి. అయితే గత 10 మ్యాచుల్లో ఈ రెండు టీమ్స్ మధ్య ఏ టీమ్ ఎక్కువగా రాణించిండో ఒక సారి చెక్ చేద్దాం. భారత్ లో కరోనావైరస్ సంక్రమణను గమనించి బీసీసీఐ ఈ లీగ్ ను పూర్తిగా యూఏఈలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోగా నేడు దుబయి ( Dubai) లో మ్యాచు ప్రారంభం అయింది. 
ALSO READ|   IPL 2020: ధోనీ నుంచి కోహ్లీ వరకు ఐపిఎల్ లో కెప్టెన్ల జీతభత్యాలు ఇవే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢీ అంటే ఢీ


ఐపీఎల్ లో కింగ్ ఎలెవన్ పంజాబ్, డిల్లీ క్యాపిటల్స్  టీమ్స్ (Delhi Capitals vs Kings Eleven Punjab)ఎన్నా సార్లు తలపడ్డాయి.  ఇక ఈ రెండు టీమ్స్ మధ్య గత 10 మ్యాచుల్లో రెండూ టీమ్స్ పోటాపోటీగా దూసుకెళ్లాయి. 2015 సంవత్సరంలో ఐపీఎల్ నుంచి ఈ రెండు టీమ్స్ 10 సార్లు పోటీలోకి దిగాయి. ఈ సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు టీమ్స్  చెరి 5-5 మ్యాచులు గెలిచాయి. అయితే ఐపిఎల్ గత నాలుగు సీజన్లో ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ కూడా ప్లేఆఫ్స్ లోకి వెళ్లలేదు.


అయితే ఐపిఎల్ 2020లో  ఈ రెండు టీమ్ 10 మ్యాచుల కన్నా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. దీంతో ఒక టీమ్ ముందుకు దూసుకెళ్తుంది. రెండు టీమ్స్ కూడా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


 



ALSO READ|  IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే


గత 4 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రికార్డులు గమనిస్తే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గత 4 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్రాక్ రికార్డులను గమనిస్తే 2015లో (IPL 2015 ) ఈ రెండు టీమ్స్ రెండు సార్లు బరిలోకి దిగాయి. రెండు మ్యాచులను డిల్లీ క్యాపిటల్స్ ( DC) గెలుచుకుంది. ఐపిఎల్ సీజన్ 9 లో కింగ్ ఎలవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిట్స్ మధ్య 2 మ్యాచులు జరిగాయి. ఇందులో ఒక మ్యాచును ఢిల్లీ గెలుచుకుంది. మరో మ్యాచ్ ను పంజాబ్ గెలచుకుంది. 


ఇక  ఐపీఎల్ 2017లో (IPL 2017) ఈ రెండు టీమ్స్ రెండు సార్లు మ్యాచులు ఆడగా.. చెరో మ్యాచును గెలుచుకున్నాయి. సీజన్ 11 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ (KXIP), ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ను రెండు సార్లు ఓడించింది. ఐపీఎల్ 12లో (IPL 2019) ఢిల్లీ క్యాపిటల్ ఒక మ్యాచును, పంజాబ్ టీమ్ ఒక మ్యాచును గెలుచుకుంది.


 



ALSO READ| Photo Story: ఐపిఎల్ లో అదరగొట్టే భారతీయ క్రీడాకారులు వీళ్లే


 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR