ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) ప్రారంభానికి రెండు, మూడు వారాల ముందు కరోనా కేసులు తక్కువగా ఉన్నా ఐపీఎల్ 2021 భారత్‌లో నిర్వహిస్తారా, లేదా వేరే దేశానికి తరలిస్తారా, మొత్తానికి సీజన్ వాయిదా వేస్తారా అనే అనుమానాలు తలెత్తాయి. అటువంటి ప్రస్తుతం దేశంలో 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి గత ఏడాది నిర్వహించాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. కానీ అక్టోబర్, నవంబర్ నెలల్లో పొట్టి ప్రపంచ కప్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏర్పాట్లు సైతం చేస్తోంది. అయితే దేశంలో కరోనా కేసులు కరోనా పరిస్థితులను గమనిస్తే, భారత్‌లో టీ20 వన్డే ప్రపంచ కప్(T20 World Cup) జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరో 3 నెలల్లో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తేనే దేశంలోనే పొట్టి ప్రపంచ కప్ జరగనుంది. లేనిపక్షంలో వేదికగా మార్చేందుకు ఐసీసీ వెనుకాడదని రిపోర్టులు చెబుతున్నాయి.


Also Read: Ravichandran Ashwin: ఐపీఎల్ 2021 నుంచి విరామం తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్, రీ ఎంట్రీ డౌట్


గత నెలలో ఐసీసీ నిర్వాహకులు, అధికారులు గుజరాత్ లోని ప్రపంచంలోని అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ , నవంబర్ నెలల్లో జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెగా ఈవెంట్ రద్దయింది. ప్రస్తుతం భారత్‌లోనూ నిర్వహించడం సాధ్యమవకపోతే యూఏఈని స్టాండ్ బై వేదికగా ఐసీసీ భావిస్తున్నట్లు రిపోర్టులు వైరల్ అవుతున్నాయి. ఐసీసీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.


Also Read: Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా


కరోనా వ్యాక్సినేషన్ ఆటగాళ్ల ఇష్టం..
మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే టీకాలు ఇస్తామని ప్రకటనలు చేశాయి. ఐపీఎల్ 2021(IPL 2021)లో ఉన్న ఆటగాళ్లకు టీకాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. కేంద్రం సైతం అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వ్యాక్సిన్ తీసుకోవాలా, వద్దా అనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమంటోంది. ఈ శనివారం నుంచి టీమిండియా క్రికెటర్లకు కోవిడ్19 టీకాలు ఇవ్వనుండగా, విదేశీ క్రికెటర్లకు టీకాలు ఇవ్వడంపై స్పష్టత రాలేదు.


Also Read: Jonny Bairstow ఆ సమయంలో బాత్రూమ్‌లో ఉన్నాడా, SRH నిర్ణయాన్ని తప్పుపట్టిన సెహ్వాగ్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook