SunRisers Hyderabad: మోకాలి గాయం కారణంగా ఐపిఎల్ 2021కి దూరమైన Natarajan

Natarajan ruled out of IPL 2021: చెన్నై: హ్యాట్రిక్‌‌ ఓటముల తర్వాత పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ఇప్పుడిప్పుడే జోష్‌‌లోకి వచ్చిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌ జట్టు‌కు వెంటనే మరో ఎదురుదెబ్బ తగిలింది‌. సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్‌‌ పేసర్‌‌ టి. నటరాజన్‌‌ IPL 2021 సీజన్‌‌ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నటరాజన్ ఆస్ట్రేలియా టూర్‌‌లో ఉండగా మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2021, 01:02 AM IST
SunRisers Hyderabad: మోకాలి గాయం కారణంగా ఐపిఎల్ 2021కి దూరమైన Natarajan

Natarajan ruled out of IPL 2021: చెన్నై: హ్యాట్రిక్‌‌ ఓటముల తర్వాత పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ఇప్పుడిప్పుడే జోష్‌‌లోకి వచ్చిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌ జట్టు‌కు వెంటనే మరో ఎదురుదెబ్బ తగిలింది‌. సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్‌‌ పేసర్‌‌ టి. నటరాజన్‌‌ IPL 2021 సీజన్‌‌ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నటరాజన్ ఆస్ట్రేలియా టూర్‌‌లో ఉండగా మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాత గాయం తిరగబెట్టింది. దీంతో నటరాజన్ మోకాలికి శస్ర్త చికిత్స (Knee surgery) అవసరం అని వైద్యులు తెలిపారు. 

మోకాలికి సర్జరీ కారణంగానే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్రాంచైజీ‌ వర్గాలు తెలిపాయి. నటరాజన్ ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు సన్‌రైజర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రెండు మ్యాచ్‌‌లు మాత్రమే ఆడిన నటరాజన్ కేవలం రెండు వికెట్లే తీశాడు. 

 

మోకాలి గాయంతో బాధపడిన కారణంగానే నటరాజన్‌ ఇంగ్లండ్‌‌తో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌‌లో తొలి నాలుగు మ్యాచ్‌‌లకు దూరమైన నటరాజన్ మళ్లీ ఇప్పుడిలా కీలకమైన ఐపిఎల్ సీజన్‌కి సైతం దూరం కావాల్సి రావడం వ్యక్తిగతంగానూ అతడికి ఇబ్బందికరమైన పరిణామమే. IPL 2021 సీజన్‌లో మిగతా మ్యాచులకు దూరం కావడంపై ఆవేదన వ్యక్తంచేసిన నటరాజన్ (T Natarajan).. గత సీజన్‌లో తాను బాగా ఆడానని, అలాగే జాతీయ జట్టులోనూ స్థానం సంపాదించుకున్నాను కానీ ఈ గాయం కారణంగా ఇలా వెనుదిరగాల్సి వచ్చిందని వాపోయాడు.

Trending News