Umpire Gives a Wide before ball was not reached the batsman: క్రికెట్ ఆటలో అంపరింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు. అంపరింగ్ చేయాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి బంతిని నిశితంగా పరిశీలించాలి.  వైడ్, నోబాల్, ఎల్బీ, రనౌట్ లాంటి విషయాల్లో సరైన నిర్ణయం ప్రకటించాలి. తప్పుడు నిర్ణయాల వలన ఒక్కోసారి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంపైర్లు చేసే తప్పిదాలు కొన్నిసార్లు ఏకంగా మ్యాచ్ గతినే మార్చేస్తాయి. అయితే ఒక్కోసారి అంపైర్లు నిర్ణయాల వలన సరదా సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విలేజ్‌ క్రికెట్‌లో భాగంగా ఇరు జట్లు మ్యాచ్ ఆడుతున్నాయి. బౌలర్ బౌలర్‌ లెగ్‌సైడ్‌ అవతల బంతి విసిరాడు. బంతి బ్యాటర్‌ వద్దకు చేరకముందే.. అంపైర్‌ వైడ్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. బ్యాటర్‌ మాత్రం అంపైర్‌ ఇచ్చిన సిగ్నల్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా.. క్రీజు బయటకు వచ్చి మరీ షాట్‌ ఆడాడు. బ్యాటుకి సరిగా కనెక్ట్ కాని బంతి.. అక్కడే గాల్లోకి లేచింది. అప్రమత్తమైన వికెట్‌ కీపర్‌ కాస్త పక్కకు జరిగి సునాయాస క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాటర్‌ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. 


ఇందుకు సంబంధించిన వీడియోనూ 'ఇంగ్లండ్‌ బార్మీ ఆర్మీ' తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేసింది. 'అంపైర్‌ అప్పటికే వైడ్ సిగ్నల్ ఇచ్చాడు.. అయినా క్యాచ్ ఔట్' అని కాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ తెగ నవ్వకుంటున్నారు. అంపైర్‌ ఫన్నీ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇదేందయ్యో ఇది.. ఈ అంపరింగ్ నేనేడా సూడలే' అని ఒకరుకామెంట్ చేయగా.. 'గెలికి మరీ మూల్యం చెల్లించుకున్నాడుగా' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 



Also Read: Rohit Sharma Record: టీ20ల్లో రోహిత్‌ శర్మ చెత్త రికార్డు.. రెండో భారత కెప్టెన్‌గా!


Also Read: మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే.. కారణం వర్షం, లగేజీ సమస్య మాత్రం కాదు!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook