IPL 2024 Auction live updates: ఐపీఎల్ వేలంలో దేశీవాళీ క్రికెటర్లు సత్తా చాటారు. యువ ఆటగాళ్లు సమీర్‌ రిజ్వి, శుభమ్‌ దూబేలు జాతీయ జట్టుకు ఇంతవరకూ ఆడలేదు. అయినప్పటికీ ఈ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ కు వేలంలో కోట్లు కుమ్మరించాయి ప్రాంచైజీస్.  ఆల్‌ రౌండర్‌ అయిన సమీర్‌ రిజ్విని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏకంగా రూ. 8.4 కోట్లకు దక్కించుకోగా.. ఫినిషర్‌ అయిన శివమ్ దూబేను రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 5.8 కోట్లకు ఎగరేసుకుపోయంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీకి చెందిన ఆల్‌ రౌండర్‌ రిజ్వీ రూ. 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. ఈ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ కోసం  చెన్నై, గుజరాత్‌లో పోటీపడ్డాయి. చివరకు అతడిని రూ. 8.4 కోట్లకు సీఎస్కే దక్కించుకుంది. ఎడమ చేతి వాటం బ్యాటర్‌ శుభమ్‌ దూబే దేశవాళీలో విదర్భకు ఆడాడు. ఇతను మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రూ. 20 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన దూబే కోసం  రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లు పోటీపడ్డాయి.  చివరకు దూబేను రూ. 5.8 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ దక్కించుకోంది.


Also Read: Unsold Player in IPL 2024: జోరుగా ఐపీఎల్ వేలం.. అమ్ముడుపోని క్రికెటర్లు వీరే..


భారీ ధరకు అమ్ముడైన భారత ఆటగాళ్లు వీళ్లే... 
హ‌ర్ష‌ల్ ప‌టేల్ – రూ.11.75 కోట్లు – పంజాబ్ కింగ్స్
సమీర్‌ రిజ్వి- రూ. 8.40 కోట్లు-చెన్నై సూపర్ కింగ్స్
షారుఖ్ ఖాన్- రూ.7.40 కోట్లు-గుజరాత్ టైటాన్స్
కుమార్ కుశాగ్రా- రూ.7.20 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
శివమ్ మావి- రూ.6.40 కోట్లు-లక్నో సూపర్ జెయింట్స్
శుభమ్‌ దూబే- రూ.5.8 కోట్లు-రాజస్థాన్ రాయల్స్ 


Also Read: IPL 2024 Auction LIVE: వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం.. భారీ ధర పలికిన కివీస్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook