Pat Cummins: ప్యాట్ కమిన్స్ కోసం హోరాహోరీ పోటీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు సొంతం చేసుకున్న ఎస్ఆర్‌హెచ్

Pat Cummins: ఐపీఎల్ 2024 అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది.. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ ఆ ఆటగాడు భారీ ధరకు అమ్ముడుపోయాడు. నువ్వా నేనా రీతిలో సాగిన పోటీలో కావ్య పాప తగ్గేదే లే అని నిరూపించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2023, 02:51 PM IST
Pat Cummins: ప్యాట్ కమిన్స్ కోసం హోరాహోరీ పోటీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు సొంతం చేసుకున్న ఎస్ఆర్‌హెచ్

Pat Cummins: ఐపీఎల్ వేలం అంటే మామూలుగా ఉండదు. ఎవరి ధర ఎంతవరకూ పోతుందో ఊహించడం కష్టం. వన్డే ప్రపంచకప్ హీరోల్లో ఇద్దరు ఊహించినట్టే భారీ ధరకు విక్రయమయ్యారు. ఒకరు ట్రేవిస్ హెడ్ అయితే మరొకరు ప్యాట్ కమిన్స్. ఇద్దరినీ సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ కోసం తగ్గేదే లే అని డిసైడ్ అయి వేలంలో దిగింది కావ్య పాప. చివరికి సాధించింది. 

ఐపీఎల్ 2024 చరిత్రలోనే అత్యధిక ధర. గతంలో ఎన్నడూ ఇప్పటి వరకూ లేనంత భారీ ధర. అక్షరాలా 20 కోట్ల 50 లక్షలు. ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ అందించిన రధ సారధి ప్యాట్ కమిన్స్ కోసం జరిగిన పోటీ చూస్తే ఉత్కంఠ కలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా రీతిలో తీవ్ర ఉత్కంఠ రేపింది. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ప్యాట్ కమిన్స్ కోసం రెండు జట్లు చివరి వరకూ పోటీ పడ్డాయి. అత్యంత ఆసక్తి కల్గించిన ప్యాట్ కమిన్స్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య ఎక్కడా తగ్గేదే లే అని డిసైడ్ అయిపోయింది. 25 లక్షల చొప్పున పెంచుకుంటూ పోయింది. చివరికి 20 కోట్ల 50 లక్షలకు చేజిక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 కోట్ల 25 లక్షల వరకూ వచ్చి ఆగిపోయింది. 

ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆల్ రౌండర్ ట్రేవిస్ హెడ్, ఆ జట్టుకు ప్రపంచకప్ అందించడంలో కీలక భూమిక వహించిన ట్రేవిస్ హెడ్‌ను కూడా సన్‌రైజర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి 6.80 కోట్లకు దక్కించుకుంది. ఇద్దరు ప్రపంచకప్ హీరోల్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కైవసం చేసుకోవడం విశేషం.

Also read: Travis Head: ట్రేవిస్ హెడ్ కోసం చెన్నై, హైదరాబాద్ మధ్య పోటీ, 6.80 కోట్లకు దక్కించుకున్న కావ్య పాప

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News