Unsold Player in IPL 2024: జోరుగా ఐపీఎల్ వేలం.. అమ్ముడుపోని క్రికెటర్లు వీరే..

IPL 2024: ఐపీఎల్ 2024 వేలంలో తొలి రోజు కొందరు క్రికెటర్ల ధరలకు రెక్కలొస్తే... మరికొందరు స్టార్ ప్లేయర్ కు మాత్రం తీవ్రనిరాశ ఎదురైంది. ఈ సారి వేలంలో స్టీవ్ స్మిత్, రూసో వంటి స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2023, 06:19 PM IST
Unsold Player in IPL 2024: జోరుగా ఐపీఎల్ వేలం.. అమ్ముడుపోని క్రికెటర్లు వీరే..

Unsold Player in IPL 2024: దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం జోరుగా జరుగుతోంది. అయితే ఈ వేలంలో కొందరు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోతే... మరికొందరిని దురదృష్టం వెంటాడింది. స్టార్క్, కమిన్స్, డారెల్ మిచెల్, హర్షల్ పటేల్, అల్జారీ జోసెఫ్, పావెల్  వంటి క్రీడాకారులు భారీ ధరకు అమ్ముడుపోయారు. కానీ ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, సౌతాఫ్రికా బ్యాటర్ రూసో వంటి ఆటగాళ్లు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ప్రాంచైజీలు. స్మిత్ ముందుంటి సంవత్సరం కూడా అమ్ముడుపోలేదు. స్మిత్ గతంలో రాజస్థాన్ రాయలస్, పూణే వారియర్స్ తరపున సారథిగా వ్యవహారించాడు. కరుణ్ నాయర్, మనీష్ పాండే వంటి భారత ప్లేయర్లు కూడా అమ్ముడుపోలేదు. 

అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే: స్టీవ్ స్మిత్, రూసో, కరుణ్ నాయర్, మనీస్ పాండే, ఫిల్ ఉప్పు, జోష్ ఇంగ్లిస్, కుశాల్ మెండిస్, లాకీ ఫోర్గూసన్, జోష్ హాజిల్‌వుడ్, వకార్ సలాంఖీల్, ఆదిల్ రషీద్, అకేల్ హుస్సేన్, ఇషా సోధి, తబ్రైజ్ షమ్సీ, ముజీబ్ ఉర్ రెహమాన్, రోహన్ కున్నుమ్మల్, సౌరవ్ చౌహాన్, ప్రియాంష్ ఆర్య, మనన్ వోహ్రా, అర్షద్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, రాజ్ బావ, వివ్రంత్ శర్మ, అజిత్ షేత్, హృతిక్ షోకీన్. 

అత్య‌ధిక ధ‌ర పలికిన టాప్-10 ఆటగాళ్లు:
1. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – రూ.24.75 కోట్లు – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్
2. ప్యాట్ క‌మిన్స్(ఆస్ట్రేలియా) – రూ.20.5 కోట్లు – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – రూ. 14 కోట్లు – చెన్నై సూప‌ర్ కింగ్స్
4. హ‌ర్ష‌ల్ ప‌టేల్(భార‌త్) – రూ.11.75 కోట్లు – పంజాబ్ కింగ్స్
5. అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్) – రూ. 11. 50 కోట్లు – రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు
6. సమీర్ రిజ్వీ (ఇండియా)- రూ. 8.40- చెన్నై సూపర్ కింగ్స్
7. రొవ్‌మ‌న్ పావెల్(వెస్టిండీస్) – రూ. 7.4 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
8. షారుఖ్ ఖాన్ (ఇండియా)- రూ.7.4 కోట్లు-గుజరాత్ టైటాన్స్
9. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) – రూ. 6.80 కోట్లు – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
10. శివమ్ మావి(భారత్)- 6.40 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్

Also Read: IPL 2024 Auction LIVE: వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం.. భారీ ధర పలికిన కివీస్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News