Unknown Facts about Sachin Tendulkar: క్రికెట్‌ అంటే వేంటనే గుర్తొచ్చే పేరు 'సచిన్ టెండూల్కర్'. క్రికెట్‌లో సచిన్ నెలకొల్పిన రికార్డ్స్ అలాంటివి. 17 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్.. ఎప్పటికీ ఎవరీ సాధ్యం కానీ రికార్డ్స్ కొన్ని నెలకొల్పాడు. 100 సెంచరీలు, 25 వేల పరుగులు, టెస్ట్-వన్డేల్లో అత్యధిక రన్స్ ఇలా  ఎన్నో ఉన్నాయి. తన అద్భుత ఆటతో క్రికెట్‌ దేవుడిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. అలాంటి  సచిన్ నేడు 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై పదేళ్లు అయినా ఇప్పటికీ సచిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సచిన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# 1987 ప్రపంచకప్ సమయంలో వాంఖడే స్టేడియంలో భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్ బాల్ బాయ్‌గా ఉన్నాడు. 24 ఏళ్ల తర్వాత అదే వేదికపై భారత్‌కు ప్రపంచకప్‌ అందించాడు.


# 1988లో బ్రబౌర్న్ స్టేడియంలో భారత్‌తో జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌ను దాయాది పాకిస్థాన్‌కి ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్ చేయమన్నారు. 


# ప్రాక్టీస్ సెషన్ మొత్తం ఔట్ కాకుండా ఉంటే సచిన్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ఒ క నాణెం బహుమతిగా ఇచ్చేవారు. అలాంటివి సచిన్ దగ్గర 13 నాణేలు ఉన్నాయి. 


# అక్టోబరు 1995లో వరల్డ్ టెల్‌తో రూ. 31.5 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేయడంతో సచిన్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్ అయ్యాడు.


# సచిన్ మొదటి కారు మారుతీ-800. 


# సచిన్ టెండూల్కర్ థర్డ్ అంపైర్ చేత ఔట్ చేయబడిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్. 


# టెండూల్కర్ 1989 నవంబర్ 15న కరాచీలో పాకిస్థాన్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఐదవ-పిన్నవయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అప్పటికి అతని వయసు 16 ఏళ్ల 205 రోజులు మాత్రమే.


# అత్యధిక వన్డే ఇంటర్నేషనల్స్ (463), మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (62), వన్డే పరుగులు (18426), టెస్ట్ రన్స్ (15,921) సచిన్ పేరునే ఉన్నాయి. 


# సచిన్ టెండూల్కర్ నలుగురు పిల్లలలో చిన్నవాడు. అతనికి ఒక అక్క మరియు ఇద్దరు అన్నలు ఉన్నారు. 


# సచిన్ నికర ఆస్తుల విలువ నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు (రూ. 1350 కోట్లు) అని తెలుస్తోంది. 


# ఆట కోసం సచిన్‌ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా ఫోన్ బిల్‌ ఎక్కువగా వస్తుందని భావించి అంజలి లెటర్స్‌ రాయడం (పెళ్లి కాకముందు) మొదలుపెట్టింది.


# సచిన్‌- అంజలిల నిశ్చితార్థం 1994లో జరిగింది. 1995 మే 24న వివాహం జరగ్గా.. 1997లో సారా, 1999లో అర్జున్‌ జన్మించాడు.


Also Read: iPhone 15 Pro Max Leak 2023: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ గురించి అతిపెద్ద లీక్.. విషయం తెలిస్తే వావ్ అంటారు!  


Also Read: Vivo Y78 Plus 5G Launch: కళ్లు మిరుమిట్లు గొలిపే 5G ఫోన్.. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో! డిజైన్‌, ఫీచర్స్ అదుర్స్  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.