World Cup 2023: భారత్ లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా వరుస గెలుపులతో కొనసాగుతుంది. అటు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో సత్తా చాటుతూ ప్రత్యర్థులను చిత్తూ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్ ల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి.. పాయింట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 229 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 129 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకూండా..  సెమీస్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. 


ఇక విషయానికి వస్తే.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 230 స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆది నుండే అడ్డంకులు ఏర్పడ్డాయి. బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను దెబ్బ తీశాడు. ఇంగ్లాండ్ జట్టును  130 కట్టడి చేసే క్రమంలో ఒకానొక సందర్భంలో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నారు. వరుసగా వికెట్లు పడే క్రమాంలో పలు సార్లు సంబరాలు చేసుకోగా.. మోయిన్ అలీ వికెట్ పడిన సందర్భంలో కోహ్లీ.. రోహిత్ శర్మను గట్టిగా హత్తుకొని పైకెత్తిన ఘటన మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. 


2019 వరల్డ్ కప్ తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. మొన్న ఆ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో ఫీల్డింగ్ విషయంలో రోహిత్ - విరాట్ ల మధ్య చిన్న వాగ్వాదం జరిగిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. కానీ నిన్నటి మ్యాచ్ లో జరిగిన సంఘటనతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేలిపోయింది. అంతేకాదండోయ్.. ఈ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


Also Read: Vizianagaram Train Accident News: విజయనగరం రైలు ప్రమాదం లైవ్ అప్‌డేట్స్.. అసలు ఏం జరిగిందంటే..?  


"మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలని ఫ్యాన్స్ కామెంట్స్" చేస్తున్నారు.. మరి కొంత మంది.. "మీరిలా సంబరాలు చేసుకుంటే మ్యాచ్ గెలిచినంత ఆనందంగా ఉందని".. మరొకరు "బెస్ట్ ఫ్రెండ్స్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


ఇక ఆడిన అన్ని మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న భారత్.. సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు అయినప్పటికీ.. నవంబర్ 2 న శ్రీలంకతో.. నవంబర్ 5 సౌత్ ఆఫ్రికా మరియు నవంబర్ 12 న నెథర్లాండ్స్ తో తదుపరి మ్యాచ్ లు జరగనున్నాయి. 


Also Read: Sukanya Samruddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన లో తక్కువ పెట్టుబడి తో కూడా మీకు ఎంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.