Virat Kohli Century: విరాట్ కోహ్లీ 45వ సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు సమం! 62 వన్డేల ముందుగానే
IND vs SL 1st ODI, Virat Kohli equals Sachin Tendulkar record. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ 80 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు.
Virat Kohli equals Sachin Tendulkar record after slams 45th ODI Hundred: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 2023 ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. 2023లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఏకంగా సెంచరీతో (Virat Kohli Century) చెలరేగాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ 80 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 113 పరుగులు చేశాడు. అంతర్జాతీయ మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 73వ సెంచరీ. టెస్టుల్లో 27, వన్డేల్లో 45, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో కోహ్లీ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంకపై శతకం బాదడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో 20 వన్డే సెంచరీలు సాధించాడు. దాంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును సమం చేశాడు. సచిన్, కోహ్లీ ఇద్దరూ స్వదేశంలో తలో 20 వన్డే సెంచరీలు బాదారు. అయితే సచిన్ 164 వన్డేల్లో 20 శతకాలు బాదగా.. 102 వన్డేల్లోనే కోహ్లీ 20 సెంచరీలను బాదేశాడు. అంటే క్రికెట్ దిగ్గజం సచిన్ కంటే 62 వన్డేల ముందుగానే విరాట్ ఈ ఫీట్ అందుకున్నాడు.
శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ఓ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఎనిమిదేసి శతకాలతో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సమంగా ఉండేవారు. ఇప్పుడు 9వ సెంచరీని ఖాతాలో వేసుకొన్న కోహ్లీ.. సచిన్‌ను అధిగమించాడు. అలాగే ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై తొమ్మిది సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ శతకాల సంఖ్య 73కి చేరింది. దాంతో సచిన్ (100) తర్వాత అత్యధిక శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డేల్లో 12,584 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దెనె (12,650) ఉన్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెందుకర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. కుమార్ సంగక్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య, మహేళ జయవర్దెనె ప్రస్తుతం కోహ్లీ కంటే ముందున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.