Bengaluru Metro Pillar: కూలిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి! 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

Mother and Son killed in Metro pillar Collapse in Bengaluru. బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మంగళవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 10, 2023, 05:10 PM IST
  • కూలిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్
  • ఇద్దరు మృతి
  • 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్
Bengaluru Metro Pillar: కూలిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి! 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

Mother and Son dies after Under Construction Metro Pillar collapses in Bengaluru: కర్ణాటకలోని బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మంగళవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఔటర్ రింగ్ రోడ్డు నాగవర సమీపంలో జరిగిన ఈ విషాద ఘటనలో ఓ మహిళ, ఆమె కుమారుడు మృతి చెందారు. మరోవైపు ఈ ప్రమాదంలో మహిళ భర్త, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న కుటుంబ సభ్యులపై నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ పై నుంచి బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 

మంగళవారం ఉదయం తేజస్విని-లోహిత్ కుమార్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరారు. లోహిత్  తన భార్య తేజస్వినిని ఆఫీస్‌కు, పిల్లలను బేబీ సిట్టింగ్​కు తీసుకెళుతున్నాడు. నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ వద్దకు చేరుకోగానే.. నిర్మాణానికి ఉపయోగించే బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది. దీంతో దంపతులు, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 28 ఏళ్ల తేజస్విని, ఆమె మూడేళ్ల కుమారుడు విహాన్ చనిపోయారు. 

తేజస్విని భర్త లోహిత్, ఆమె కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో తేజస్విని, లోహిత్ కుమార్ ఇద్దరూ హెల్మెట్లు ధరించి ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లలు కవలలు అని కూడా చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, మెట్రో సిబ్బంది సహాయంతో కూలిపోయిన పిల్లర్​, ఇనుప రాడ్లను క్లియర్​ చేశారు. ఆపై ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయింది. 

Also Read: Hyundai Cars Discontinued: హ్యుందాయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. క్రెటా, వెర్నా, ఐ20లో 11 వేరియంట్‌లు నిలిపివేత!

Also Read: Tata Cars Offers 2023: టాటా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా 75,000 తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News