ముంబై: టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ చేసి కొత్త రికార్డులు సృష్టించాడు. టెస్ట్ కెరీర్‌లో కెప్టెన్‌గా తొమ్మిదిసార్లు 150కి పైగా స్కోర్ చేయడం ద్వారా. ఇప్పటివరకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. కెరీర్‌లో కోహ్లీకిది ఏడో డబుల్ సెంచరీ. టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏడు డబుల్ సెంచరీలు చేసిన భారతీయ క్రికెటర్‌గానూ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 


ఈ క్రమంలోనే కోహ్లీ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. భారతీయ క్రికెటర్లలో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజాలుగా వీరేంద్ర సేహ్వాగ్, సచిన్ టెండుల్కర్‌ల పేరిట ఉన్న రికార్డును సైతం కోహ్లీ బద్దలుకొట్టాడు. మొత్తంగా టెస్టుల్లో కోహ్లీకి ఇది 26వ సెంచరీ. కోహ్లీ టెస్ట్ కెరీర్‌లో మొత్తంగా ఇది అతడికి 81వ మ్యాచ్ కాగా కెప్టేన్‌గా కోహ్లీకి ఇది 50వ మ్యాచ్ కావడం విశేషం.