Virat Kohli Video: `ఏయ్ నా పిల్లల ఫొటోలు తీస్తారా?` మహిళా జర్నలిస్టుపై విరాట్ కోహ్లీ చిందులు
Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
Melbourne Airport: తన వ్యక్తిగత కుటుంబం విషయంలో గోప్యత పాటిస్తున్న విరాట్ కోహ్లీ పిల్లల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటివరకు తన పిల్లల ఫొటోలను బయట కనిపించకుండా విరాట్ కోహ్లీ జాగ్రత్త పడుతుండగా ఒకచోట తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీస్తుండగా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నా పిల్లల ఫొటోలు, వీడియోలు ఎందుకు తీసుకుంటున్నారు?' అని జర్నలిస్టులు.. వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లపై మండిపడ్డారు. దీంతో ఎయిర్‌పోర్టులో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Also Read: Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ప్రకటన.. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై
ఆస్ట్రేలియా-భారత్ మధ్య డిసెంబర్ 26వ తేదీ నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు షురూ కానుంది. గురువారం మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టుకు భార్య అనుష్క శర్మ, పిల్లలు అకాయ్, వామికతో కలిసి వెళ్లాడు. ఆ క్రమంలో అక్కడ ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను అక్కడి మీడియా ఇంటర్వ్యూ చేస్తోంది. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న అనుష్క శర్మ కుటుంబాన్ని అక్కడి ఫోటో జర్నలిస్టులు ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో ఒక్కసారిగా కోహ్లీకి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: Australia vs India Highlights: ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కిన భారత్.. అసలు కథ రేపే..!
కోపంతో దూసుకొచ్చిన కోహ్లీ 'ఫొటోలు ఎందుకు తీశారు' అంటూ ఫొటో జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగాడు. 'నా పిల్లల విషయంలో నాకు కొంత గోప్యత కావాలి. నన్ను అడగకుండా మీరు ఫొటోలు తీయొద్దు' అంటూ చెప్పాడు. ఆ తర్వాత మీడియా ప్రతినిధి వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు చూపించాలని కోరాడు. తన కుటుంబానికి సంబంధించి ఏవైనా ఫొటోలు, వీడియోలు ఉంటే డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. దీనికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోహ్లీ కోపోద్రిక్తుడు కావడం సంచలనం రేపింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో మ్యాచ్ డ్రా కావడంతో 26వ తేదీ నుంచి జరగనున్న నాలుగో టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. నాలుగు, ఐదు మ్యాచుల్లో విజయం సాధించి కివీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. మరి భారత్ సిరీస్ సాధిస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.