విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శలు సంధించారు. మైదానంలో కోహ్లీ తప్పులు చేస్తున్నాడని.. ఎవరూ వేలెత్తి చూపటం లేదని.. ఇలానే జరిగితే కెప్టెన్సీకే ప్రమాదమని అన్నారు. సాధారణంగా కెప్టెన్ తప్పు చేస్తే.. జట్టులోని సభ్యులు మాట్లాడుకుంటారు. అలాంటి ఆటగాళ్లను జట్టులో నేను చూడలేదు. మైదానంలో గానీ, డ్రెస్సింగ్ రూమ్ లో గానీ విరాట్ చేస్తున్న తప్పులను వేలెత్తి చూపే ఒక్క ఆటగాడు లేదని అన్నారు.


అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ మంచి బ్యాట్స్ మెన్.. నేను అది తప్పుపట్టడం లేదు. కానీ ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అదే స్థాయిలో ఆటతీరును ఆశిస్తున్నాడని.. దీనివల్ల అంచనాలకు చేరుకోలేకపోతున్నాడని.. ఇదే పరిస్థితి కొనసాగితే కెప్టెన్సీకే ప్రమాదమని చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ సలహాలు తీసుకొని.. మైదానంలో వాటిని అమలు పరచడం లేదని అన్నారు. ఏ ఒక్కరి కష్టంతో విజయం దక్కదని.. సమిష్టి కృషితోనే విజయం వరిస్తుందనే విషయాన్ని గుర్తించుకొని టీంవర్క్ చేయాలని హితవు పలికారు.