Mehdi Hasan Miraj On Virat Kohli: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్‌కు తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన పిక్‌ను మెహదీ హసన్ మిరాజ్ సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఇది గొప్ప క్రికెటర్ విరాట్‌ కోహ్లీ నుంచి తనకు స్పెషల్ గిఫ్ట్ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా టూర్‌లో బంగ్లా ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్‌ అద్భుతంగా రాణించాడు. బంగ్లాదేశ్ 2-1తో వన్డే సిరీస్‌లో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మిరాజ్ 141.00 సగటుతో 141 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అంతేకాకుండా సిరీస్‌లో నాలుగు వికెట్లు కూడా తీశాడు. ఈ యంగ్ ప్లేయర్ ఆల్ రౌండ్ ప్రదర్శనకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.


టెస్ట్ సిరీస్‌లో హసన్ మిరాజ్ రాణించాడు. రెండు టెస్టుల్లో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను సిరీస్‌లో బ్యాట్‌తో 53 పరుగులు చేశాడు.  


రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (84) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఉమేష్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71) ఆకట్టుకున్నారు. అనంతరం టీమిండియా 314 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) రాణించారు. తైజుల్ ఇస్లాం (4/74), షకీబ్ అల్ హసన్ (4/79) మంచి ప్రదర్శన చేశారు. భారత్ 87 పరుగుల ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌటైంది. లిట్టన్ దాస్ (73), జకీర్ హసన్ (51) అర్ధ సెంచరీలతో రాణించగా.. నూరుల్ హసన్ (31), తస్కిన్ అహ్మద్ (31) కూడా విలువైన పరుగులు చేశారు.


భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/68) రాణించాడు. అశ్విన్, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు. ఉమేష్‌కు ఒక వికెట్ దక్కింది. 145 పరుగుల లక్ష్య ఛేదనలో 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రవిచంద్రన్ అశ్విన్ (42), శ్రేయస్ అయ్యర్ (29) ఆదుకోవడంతో భారత్‌ను మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పుజారాకు మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్‌ అవార్డు దక్కింది.


Also Read: China Corona Update: కరోనాకే కంగారు పుట్టించేలా.. దంపతుల సూపర్ ఐడియా.. వీడియో వైరల్  


Also Read: బంగారం కంటే విలువైన మూలిక.. చైనా చొరబాటుకు అసలు కారణం వెలుగులోకి..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook