Virat Kohli: నా హృదయంలో ఆ రోజుకు ప్రత్యేక స్థానం.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్
Virat Kohli Latest Instagram Post: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై సూపర్ ఇన్నింగ్స్‌తో చరిత్రలో మర్చిపోలేని విజయాన్ని అందించాడు.
Virat Kohli Latest Instagram Post: టీ20 ప్రపంచకప్ తరువాత టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో జరగబోయే బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమవుతుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు కోహ్లీ. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ గురించి పంచుకున్నాడు. తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండే తేదీని కూడా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 23న జరిగింది. ఈ తేదీ అత్యంత ప్రత్యేకమైనదని కోహ్లీ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం పెవిలియన్‌కు నడుచుకుంటు వెళుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.'23 అక్టోబర్ 2022 నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది' అని క్యాప్షన్‌లో రాశాడు. 'క్రికెట్‌లో ఇంతటి ఎనర్జీ గతంలో ఎన్నడూ కనిపించలేదు. ఎంతో అందమైన సాయంత్రం అది..' అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మెల్‌బోర్న్ మైదానంలో 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ హార్థిక్ పాండ్యాతో కలిసి కోహ్లీ భారత్‌ను ఆదుకున్నాడు.
చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉండగా.. సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. తర్వాతి బంతికి దినేశ్ కార్తీక్ సింగిల్ తీశాడు. తర్వాత మూడో బంతికి విరాట్ 2 పరుగులు పూర్తి చేశాడు. తర్వాతి బంతి నో బాల్ కాగా.. దానిని విరాట్ భారీ సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతి వైడ్ కాగా.. నాలుగో బంతికి 3 పరుగులు వచ్చాయి. ఇక చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి దశలో 5వ బంతికి కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. తర్వాతి బంతి వైడ్ కాగా.. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది.
Also Read: Baba Ramdev: మహిళలు దుస్తులు లేకపోయినా అందంగా ఉంటారు.. బాబా రామ్‌దేవ్ కాంట్రవర్సీ కామెంట్స్
Also Read: India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook