India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు

Ind Vs Nz Highlights: ఇటీవల టీ20 ఫార్మాట్‌లో కీలక బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా లేని లోటు భర్తీ చేశాడు. వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాడు. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతను ఎవరంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 10:27 AM IST
  • తొలి వన్డేలో భారత్ ఓటమి
  • భారీ టార్గెట్ విధించినా.. నిరాశపర్చిన బౌలర్లు
  • ఆదివారం రెండో వన్డే మ్యాచ్‌
India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు

Arshdeep Singh: టీ20 సిరీస్ గెలుచుకుని ఊపుమీదున్న టీమిండియాకు.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్యాట్స్‌మెన్ బాగా ఆడినా.. బౌలర్లు విఫలమవ్వడంతో ఓటమి పాలైంది. భారత బ్యాట్స్‌మెన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. బౌలర్లు పూర్తిగా ఫ్లాప్‌ షోతో నిరాశపరిచారు. ఇక ఇటీవల టీ20ల్లో సూపర్ స్టార్‌గా నిలుస్తున్న యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ తొలి వన్డేలో విఫలమయ్యాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ అంచనాలను అందుకోలేకపోయాడు. 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో యువ ఫాస్ట్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లకు టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అర్షదీప్ సింగ్ గత కొంతకాలంగా టీ20 క్రికెట్‌లో టీమిండియాకు కీ ప్లేయర్‌గా మారిపోయాడు. బుమ్రా గాయంతో వైదొలిగిన తరువాత ఈ యంగ్ బౌలర్‌ రోల్ మరింత కీలకంగా మారింది. టీ20ల్లో అంచనాలకు మించిన రాణించిన ఈ స్పీడ్ స్టార్.. అరంగేట్రం చేసిన తొలి వన్డేలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. 

తొలి వన్డేలో టీమిండియా తరుపున అత్యంత పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో  8.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్.. 8.30 ఎకానమీతో 68 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పొదుపుగా బౌలింగ్ చేయడం.. ప్రారంభంలోనే వికెట్లు తీయడం అర్ష్‌దీప్ స్టైల్. కానీ అతను ఈ మ్యాచ్‌లో రెండింటినీ చేయలేకపోయాడు. 

ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో ప్రదర్శన 

అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు టీమిండియా తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 8.17 ఎకానమీతో ఇస్తూ 33 వికెట్లు తీశాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ 2022లో మంచి ప్రదర్శన ఇచ్చి జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. బుమ్రాలేని లోటును అర్షదీప్ పూడ్చాడు. మరో రెండు వన్డేలు ఉండడంతో అతను కచ్చితంగా పుంజుకుంటాడని అభిమానులు అంటున్నారు.

ఆక్లాండ్‌ వేదికగా జరిగిన మొదటి వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (72), శ్రేయస్‌ అయ్యర్‌ (80), శుభ్‌మన్ గిల్‌ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్‌ సుందర్ (37) మెరవగా.. సంజూ శాంసన్ (36) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్‌ సౌథీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 307 టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్.. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 47.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టామ్‌ లాథమ్ (145), కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ (94) చివరివరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించారు. భారత బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 2, శార్దూల్‌ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. హామిల్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.

Also Read: 7th Pay Commission Update: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా ఖాతాల్లో నగదు జమ..?  

Also Read: CM KCR: అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఫిక్స్..? పార్టీ నేతలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News