Kohli Fans Fires On BCCI: బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడమే కారణం
Kohli Fans Fires On BCCI: ఇండియా వన్డే క్రికెట్ టీమ్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తొలగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) కీలక నిర్ణయం ప్రకటించింది. అతడి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో బీసీసీఐ సహా సౌరవ్ గంగూలీపై కోహ్లీ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kohli Fans Fires On BCCI: ఈ ఏడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా వెళాల్సి ఉంది. ఈ క్రమంలో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) ప్రకటించింది. ఈ పర్యటనలో రోహిత్ శర్మను వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. అయితే విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తొలగించడంపై ట్విట్టర్ లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు మాత్రం బీసీసీఐ, సౌరవ్ గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"టీ20లతో పాటు వన్డేల్లో టీమ్ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించాలని ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది" అని బీసీసీఐ బుధవారం తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అయితే.. విరాట్ కోహ్లీ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు కమిటీకి చెప్పాడా? లేదా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఫ్యాన్స్ ట్వీట్లు..
టీ20 ప్రపంచకప్‌నకు ముందు సారథిగా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. 2023 ప్రపంచకప్ దృష్ట్యా వన్డే, టెస్టు జట్లకు మాత్రం సారథిగానే కొనసాగుతానని పేర్కొన్నాడు. అయినప్పటికీ.. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సహా సెక్రటరీ జై షా పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: India Squad for South Africa Series: టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..జడేజాతో పాటు మరో ఇద్దరు ఔట్
Also Read: Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook