T20 WC 2024: బీసీసీఐ బిగ్ స్కెచ్.. టీ20 ప్రపంచ కప్ నుంచి కోహ్లీ ఔట్.. కారణం ఇదే..!
Virat Kohli: ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి కోహ్లీని పక్కకు పెట్టాలని భావిస్తుందట బీసీసీఐ. దానికి ఓ కారణం చెబుతోంది. అది ఏంటంటే?
T20 World Cup 2024 Updates: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగబోయే 2024 టీ20 వరల్డ్ కప్ కు కోహ్లీని జట్టు నుంచి పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరేబియన్ దేశంలోని స్లో పిచ్ లపై కోహ్లీ బ్యాటింగ్ కు సరిపోవని సెలక్టర్లు భావిస్తున్నారట. ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతను సెలక్టర్ అగార్కర్ అప్పజెప్పినట్లు సమాచారం. రోహిత్ ప్రపంచకప్ లో ఖచ్చితంగా ఆడతాడని చెప్పిన బీసీసీఐ.. కోహ్లీ విషయంలో అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు.
గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ఆడింది కేవలం రెండు టీ20 మ్యాచ్ లే. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ తో. ఒక మ్యాచ్ లో 29 పరుగులు చేయగా.. మరోక మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ తో సిరీస్ కు దూరమైన కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ కు రెడీ అవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అతను బరిలోకి దిగనున్నాడు. రాబోయే ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తే కింగ్ కోహ్లీని వరల్డ్ కప్ టీమ్ కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
2013 నుండి టీమిండియా ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రిస్క్ చేయడానికి కూడా సెలక్టర్లు వెనుకాడటం లేదు. అందులో భాగంగానే.. కోహ్లీని తప్పించాలని చూస్తున్నారు. ముఖ్యంగా యంగ్ స్టార్స్ మాంచి జోరు మీదున్నారు. ఏడాదికిపైగా కోహ్లీ టీ20లు ఆడకపోవడంతో కిషాన్, గైక్వాడ్, గిల్, శివమ్ రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జూన్ లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ లో పాకిస్తాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడాతోపాటు భారత్ గ్రూప్-ఏలో ఉంది. జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది.
Also Read: Durham vs Eagles: ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. గల్లీ క్రికెట్ కంటే దారుణం.. 16 రన్స్‌కే ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter