Virat Kohli : అప్పటివరకు నా ఆట ఆగదు: విరాట్ కోహ్లీ
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఇటీవల ఫుల్లు ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు పెనుసవాలుగా మారడంతో పాటు ఐసిసి ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లీ అగ్రభాగాన కొనసాగుతున్నాడు.
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఇటీవల ఫుల్లు ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు పెనుసవాలుగా మారడంతో పాటు ఐసిసి ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లీ అగ్రభాగాన కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఇండియా తరపున 84 టెస్టులు, 248 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 82 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన విరాట్ కోహ్లీ... టెస్టుల్లో 12,457, వన్డేల్లో 11,867, టీ20 మ్యాచ్‌ల్లో 2,794 పరుగులు పూర్తిచేశాడు. 2021 ప్రపంచ టీ20 కప్ తర్వాత మూడు ఫార్మాట్లలో ఏదైనా ఒకదానికి కోహ్లీ గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయా అనే టాక్ మొదలైంది. యంగ్ టాలెంట్‌కి అవకాశం కల్పించడంతో పాటు తాను కూడా ఏవైనా రెండు ఫార్మాట్లపైనే దృష్టిసారించడానికి వీలుగా.. కోహ్లీ ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడా అనే సందేహాలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయమై కోహ్లీని టచ్ చేయగా... రానున్న మరో మూడేళ్ల వరకు మూడు ఫార్మాట్లలో తన ఆట కొనసాగుతుందని కోహ్లీ స్పష్టంచేశాడు.
గత 8 ఏళ్ల నుంచి ఏడాదికి 300 రోజుల పాటు ఆటతోనే గడిపేస్తున్నానని.. అందులో ట్రావెలింగ్, ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉన్నాయని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. వచ్చే మూడేళ్లలో ఒక టీ20 వరల్డ్ కప్, మరో వన్డే వరల్డ్ కప్ ఆడే వరకు భారత జట్టుకు తన అవసరం తప్పనిసరని.. అప్పటి వరకు ఏ పార్మాట్‌లోనూ తాను ఆట ఆపే ప్రసక్తే లేదని కోహ్లీ చెప్పకనే చెప్పాడన్న మాట!