కోల్‌కతా: 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిస్తే కెప్టెన్ కొహ్లీ తన మాదిరిగానే చొక్కా విప్పడం ఖాయమని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ అన్నాడు. 'నేను హామీ ఇస్తున్నా చూసుకోండి. ఇంగ్లాండ్‌లో జరిగే 2019 ప్రపంచకప్‌లో భారత్ గెలిస్తే.. కొహ్లీ చొక్కా విప్పేసి కప్ పట్టుకొని ఆక్స్‌ఫర్డ్ వీధిలో తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. కొహ్లీ సంబారాలు, అతని సిక్స్ ప్యాక్ చూసేందుకు మంచి కెమరాలు సిద్ధం చేసుకోవాలి.' అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా సిక్స్ ప్యాక్‌తో తిరిగే వాళ్లలో హార్దిక్ పాండ్య, బుమ్రా కూడా ఉంటారని గంగూలీ అన్నారు. క్రికెట్ చరిత్రకారుడు బోరియా ముజుందార్ రాసిన 'ఎలెవన్ గాడ్స్ అండ్ ఏ బిలియన్ ఇండియన్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.  దాదా ఆ మాటలు అంటున్నప్పుడు అక్కడ కొహ్లీ కూడా ఉండటం కొసమెరుపు.


గంగూలీ మాటలకు కోహ్లీ ప్రతిస్పందించాడు. 'నేను షర్టు లేకుండా నడుస్తాను. అంతేకాదు, నాతో పాటు ఇంకొంతమంది ఆటగాళ్లు కూడా చేరతారు' అని చెప్పారు. "ఇది నాకు మాత్రమే అని నేను భావించడం లేదు." అన్నారు.


హార్దిక్ పాండ్య పేరును గంగూలీ ప్రస్తావించినప్పుడు, కోహ్లి మాట్లాడుతూ ' హార్దిక్ పాండ్య నాతో పాటు వస్తాడు.  120% పక్కాగా నాతో పాటు వస్తాడు. బమ్రాకు కూడా సిక్స్ ప్యాక్ ఉంది. అతను కూడా ఆటలో ఉన్నాడు' అన్నాడు


గంగూలీ ఇంగ్లండ్‌తో జరిగిన నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో గెలిచిన తరువాత  లార్డ్స్‌లో తన చొక్కాను తీసేశాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ భారతదేశంపై గెలిచిన తరువాత తన చొక్కాను తీసివేశాడు. అందుకు ప్రతిస్పందనగా గంగూలీ ఆరోజున అలా చేశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు విరాట్ కోహ్లీ వయసు 13 ఏళ్లు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పదకొండవ సీజన్‌లో కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆదివారం ఆర్‌సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.