25 ఏళ్ల సంజూ శాంసన్ ( Sanju Samson ) ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనంగా మారారు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సంజూ పరుగుల వరద పారిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. ఈ ఆటగాడి గురించి ఆస్ట్రేలియన్ లెజెండరీ ప్లేయర్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్ ఇండియాలో సంజూను తీసుకోవాలి అని సూచించాడు వార్న్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Kane Williamson Memes: కేన్ విలియమ్సన్ పై ట్రెండ్ అవుతున్న మేమ్స్


తన ఆటతీరు గురించి ఇటీవలే మాట్లాడిన సంజు శాంసన్..తను మరో 10 సంవత్సరాలు క్రికెట్ ( Cricket ) ప్రపంచానికి సేవ చేయాలి అనుకుంటున్నానని తెలిపాడు. అయితే తనను అత్యధికంగా ప్రేరణ కలిగించిన ఆటగాడు టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ అని తెలిపాడు.


కోహ్లీ ఇచ్చిన సలహా తనను మెరుగైన ఆటగాడిగా మలిచింది అని అంటున్నాడు సంజూ. క్రికెట్ విషయంలో తను ఎప్పుడూ సీరియస్ గా ఉంటాను అని.. అయినా కానీ కోహ్లీ మాటలు తనపై మ్యాజిక్ చేశాయన్నాడు.  తను ఫిట్ గా లేను అనిపిస్తే ఆటకు ఇక సెలవు చెబుతానన్నాడు. కోహ్లీతో జరిగిన సంభాషణ గురించి ఆన్ లైన్ సంభాషణలో పంచుకున్నాడు సంజూ.



ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?


"నేను టీమ్ ఇండియా క్రికెటర్లతో కలిసి జిమ్ వర్కవుట్ చేస్తున్నాను. కోహ్లీ కూడా అక్కడే ఉన్నాడు. కోహ్లీ వద్దకు వెళ్లి నా మనసులో ఉన్నది అడిగాను"


సంజూ శాంసన్:  మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి  ?


విరాట్ కోహ్లీ :  సంజూ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆడాలి అనుకుంటున్నావు  ?


సంజూ శాంసన్:  నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు . నేను సులభంగా మరో 10 సంవత్సరాలు ఆడగలను


విరాట్ కోహ్లీ :  పదేళ్ల తరువాత నువ్వు ఏమైనా చేయగలవు. నీకు నచ్చింది చేయవచ్చు. కానీ ఈ పదేళ్లలో నువ్వు చేయగలిగింది అంతా ఎందుకు చేయవు ?



ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే


ఈ ప్రశ్న తనను ఆలోచనలో పడేసింది అని.. క్రికెట్ పై మరింత మమకారాన్ని పెంచుకోవడానికి దోహదం చేసింది అన్నాడు సంజూ టీమ్ కోసం మరింత శ్రమించాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది అని అర్థం చేసుకున్నా అని అన్నాడు. టీమ్ విజయం కోసం తను చేయాల్సిన ప్రతీ విషయాన్ని తూచ తప్పకుండా పాటిస్తానని తెలిపాడు. 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR