Virat Kohli ODI captaincy: విరాట్ కోహ్లీ ఫోన్ స్విఛ్చాఫ్‌లో ఉంది.. కారణం ఏంటో తెలియదు: కోచ్
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. కెప్టెన్సీ మార్పు చేయడానికి గల కారణాన్ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సరిగ్గా చెప్పలేకపోయిందన్నారు.
Virat Kohli's childhood coach Rajkumar Sharma surprised at Sourav Ganguly's statement: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి స్వయంగా తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పిస్తూ రోహిత్ శర్మ (Rohit Sharma)ను సారథిగా నియమించింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంచి నిర్ణయం తీసుకుందని పలువురు మాజీలు అభిప్రాయపడగా.. మరికొందరు మాత్రం ఇలా చేయడం తప్పని అంటున్నారు. ఈ క్రమంలో కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma) స్పందించారు. కెప్టెన్సీ మార్పు చేయడానికి గల కారణాన్ని సెలెక్షన్ కమిటీ సరిగ్గా చెప్పలేకపోయిందన్నారు.
తాజాగా విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma) ఖేల్‌నీతి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ... 'వన్డే కెప్టెన్సీ మార్పు జరిగిన తర్వాత నేను విరాట్ కోహ్లీతో మాట్లాడలేదు. కొన్ని కారణాల వల్ల అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉండొచ్చు. సరైన కారణం ఏంటో తెలియదు. అయితే నా అభిప్రాయం ప్రకారం.. టీ20 కెప్టెన్‌గా కోహ్లీ తనకుతానే తప్పుకున్నాడు. అయితే ఆ సమయంలోనే వన్డే సారథ్యం (Virat Kohli ODI Captaincy) నుంచి కూడా తప్పుకోమని బీసీసీఐ సెలెక్టర్లు అడగాల్సింది. లేదా టీ20 కెప్టెన్సీ నుంచీ వైదొలగవద్దు అని చెప్పాలి. కానీ ఇలా చేయడం మాత్రం అసలు బాలేదు' అని అన్నారు.
Also Read: Virat Kohli: పాపం విరాట్ కోహ్లీ.. 2021 ఏమాత్రం కలిసిరాలేదుగా! ఆ ఒక్క సంతోషం తప్ప.. అన్ని పాయే!!
వన్డే కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'టీ20 ప్రపంచకప్ 2021కు ముందు టీమిండియా టీ20 సారథ్యం నుంచి దిగిపోవద్దని విరాట్ కోహ్లీని బీసీసీఐ కోరినట్లు సౌరవ్ గంగూలీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చదివా. అయితే అలా అడిగినట్లు నాకైతే గుర్తు లేదు. ఈ ప్రకటన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో విభిన్న కథనాలు బయటకు వస్తున్నాయి. విరాట్ స్థానంలో రోహిత్ శర్మను నియమించడంపై సెలెక్షన్ కమిటీ సరైన కారణం వెల్లడించలేదు. ఇంతకు మేనేజ్‌మెంట్ లేదా బీసీసీఐ (BCCI) లేదా సెలెక్టర్లకు ఏమి కావాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు. దానిపై సరైన వివరణ లేదు. పారదర్శకత లోపించింది' అని కోహ్లీ చిన్ననాటి కోచ్ అసహనం వ్యక్తం చేశారు.
యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. నిజానికి టోర్నీ ఆరంభానికి ముందే విరాట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. టీ20 సమరం ఆరంభం కాకముందే ఐపీఎల్ 2021 రెండో దశ జరగ్గా.. అప్పుడు కూడా విరాట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా (RCB Captain) కూడా తనకు ఇదే చివరి ఐపీఎల్ (IPL) టోర్నమెంట్ అని ప్రకటించాడు. తాజాగా బీసీసీఐ అతడికి షాక్ ఇచ్చింది.
Also Read: Two Farmers Killed : నిరసన ప్రాంతం నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు రైతుల మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి