టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు, ట్విటర్‌లో కోహ్లీ ఆట ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ప్రపంచం నలుమూలల నుంచి కోహ్లీ అభిమానులు స్పందించే తీరే చెబుతుంది అతడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందనేది. అలాగే పాకిస్తాన్‌లోనూ కూడా కోహ్లీకి వీరాభిమానులు వున్నారని నిరుపిస్తూ ఆ దేశానికి చెందిన షాబాజ్ షరీఫ్ ఖాస్మి అనే ఒక అభిమాని.. కోహ్లీని పాకిస్తాన్‌కి ఆహ్వానించాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాహోర్‌లో బుధవారం పాక్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టీ -20 సందర్భంగా పాకిస్తాన్‌లో కోహ్లీ క్రికెట్ ఆడితే చూడాలని ఉందని కోరుకుంటున్నట్టుగా ఉన్న ప్లకార్డు పట్టుకుని స్టేడియంలో సందడి చేశాడు. అంతటితో సరిపెట్టుకోని షాబాజ్.. ఆ ఫోటోను  ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ట్వీట్ దాయాది దేశంలో కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి నిదర్శనంగా నిలిచింది.