VVS Laxman: జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) బాధ్యతలు చేపట్టాడు. మెుదటి రోజు గడిచిన విధానాన్ని ఈ సొగసరి బ్యాట్స్ మెన్ ట్విట్టర్(Twitter)లో పంచుకున్నాడు. ''ఎన్సీఏ(NCA)లో మొదటి రోజు అద్భుతంగా గడిచింది. కొత్త సవాలు ఎదురు కానుంది. భారత క్రికెట్ భవిష్యత్ కోసం పనిచేయడం గొప్ప అవకాశం'' అని రాశాడు. గత నెలలో భారత మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధృవీకరించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read: ICC Player of The Month: ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​గా వార్నర్​, హేలీ మ్యాథ్యూస్


భారత మాజీ కెప్టెన్ గంగూలీ(Ganguly) ఆటను అభివృద్ధి చేయడంలో మాజీ క్రికెటర్లను భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ ద్రవిడ్‌(Rahul Dravid)ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా అంగీకరించేలా దాదా కృషి చేశాడు. బీసీసీఐ చీఫ్ మాత్రమే కాదు, సెక్రటరీ జే షా, ఇతర సీనియర్ అధికారులు కూడా లక్ష్మణ్ ఎన్సీఏ పాత్రను చేపట్టాలని కోరారు. భారత్ హెడ్ కోచ్‎గా రాహుల్ ద్రవిడ్, ఎన్‎సీఏ(National Cricket Acdemy) హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయడం మంచి పరిణామం అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి