Wasim Jaffer names T20 World Cup 2022 Highest Run Scorer and Highest Wicket Taker: టీ20 ప్రపంచకప్ 2022 ఆస్ట్రేలియాలో రసవత్తరంగా జరుగుతోంది. సినిమాలో మాదిరి యాక్షన్, డ్రామా మరియు సస్పెన్స్‌తో కూడిన అద్భుత క్షణాలను ఇప్పటికే మనకు అందించింది. అన్నిటికంటే మించి వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవడం టాప్ జట్ల సెమీస్ అవకాశాలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గ్రూప్-1 జట్ల సెమీస్ అవకాశాలపై సందిగ్ద నెలకొంది. వరణుడు ఎవరిని కరుణిస్తాడో, ఎవరిని ముంచుతాడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతుండడంతో మాజీలు సెమీస్ చేసే జట్లను అంచనా వేస్తున్నారు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు సెమీస్ చేరుతాయని చాలా మంది అంచనా వేశారు. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ ఓ అడుగు ముందుకేసి.. టీ20 ప్రపంచకప్ 2022లో టాప్‌ రన్‌ స్కోరర్‌, హైయెస్ట్ వికెట్ టేకర్ల పేర్లు చెప్పాడు. మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ అత్యధిక రన్స్ చేస్తాడని, అర్ష్‌దీప్‌ సింగ్ అత్యధిక వికెట్స్ తీస్తాడని జాఫర్‌ అంచనా వేశాడు. 



టీ20 ప్రపంచకప్ 2022లో టాప్‌ రన్‌ స్కోరర్‌, హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు అని సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వసీం జాఫర్‌ను ఓ నెటిజన్‌ అడిగాడు. 'విరాట్ కోహ్లీ మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మెగా టోర్నీలో అత్యధిక రన్స్ అతడే చేస్తాడు. అర్ష్‌దీప్‌ సింగ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచులలో ఐదు వికెట్స్ పడగొట్టాడు. అతడే హైయెస్ట్ వికెట్ టేకర్' అని జాఫర్‌ బదులిచ్చాడు. 


పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై ఆడిన మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ వరుసగా 82 నాటౌట్‌, 62 నాటౌట్‌ రన్స్ చేశాడు. రెండు మ్యాచ్‌లలో విరాట్ 144 పరుగులు బాదాడు. అర్ష్‌దీప్‌ సింగ్ పాక్‌తో మ్యాచ్‌లో మూడు, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. గ్రూప్-2లో భారత్ రెండు మ్యాచులలో గెలిచి 4 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాపై గెలిస్తే.. సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంటుంది. 


Also Read: Meenakshi Chaudhary Pics: బాబోయ్.. మీనాక్షి చౌదరి! కిలాడీ భామ అందాలకు కుర్రకారు బోల్డ్


Also Read: Pranitha Subhash Pics: నడి రోడ్డుపైనే ముదుపెట్టిన ప్రణీత సుభాష్.. ఓ బిడ్డకు తల్లైనా తగ్గేదేలే..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook