Pranitha Subhash Pics: నడి రోడ్డుపైనే ముదుపెట్టిన ప్రణీత సుభాష్.. ఓ బిడ్డకు తల్లైనా తగ్గేదేలే..!

Pranitha Subhash kisses statue in Road at Salzburg. ప్రణీత సుభాష్ సాల్జ్‌బర్గ్ వీధుల్లో ఉండే ఓ బొమ్మకు కిస్ పెట్టారు. ప్రణీత మైమరిపించే అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 28, 2022, 08:20 PM IST
  • నడి రోడ్డుపైనే ముదుపెట్టిన ప్రణీత సుభాష్
  • ఓ బిడ్డకు తల్లైనా తగ్గేదేలే
  • ప్రణీత సుభాష్ అందాల విందు
Pranitha Subhash Pics: నడి రోడ్డుపైనే ముదుపెట్టిన ప్రణీత సుభాష్.. ఓ బిడ్డకు తల్లైనా తగ్గేదేలే..!

Actress Pranitha Subhash kisses statue in Road at Salzburg: 1992 అక్టోబరు 17న బెంగుళూరులో ప్రణీత సుభాష్ జన్మించారు. ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసిన ప్రణీత.. బెంగళూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు. 

2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన 'పోకిరి' రీమేక్ ద్వారా కన్నడలో ప్రణీత సుభాష్ సినీ రంగ ప్రవేశం చేశారు. 

'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో ప్రణీత సుభాష్ తెలుగులో తెరంగేట్రం చేశారు. సిద్దార్థ్ సరసన తెలుగులో నటించిన బావ సినిమాతో ప్రణీత కు మంచి గుర్తింపు వచ్చింది. 

అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి ప్రణీత సుభాష్ తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో 2021 మే 30న ప్రణీత వివాహం జరిగింది. 2022 జూన్ 10న ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. 

బిడ్డ పుట్టిన అనంతరం తనను తాను మునిపటిలా మార్చుకునేందుకు జిమ్‌లో ప్రణీత చెమటోడుస్తున్నారు. బెంగళూరు బ్యూటీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత మైమరిపించే అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా ప్రణీత ఆస్ట్రేలియాకు వెళ్లారు. సాల్జ్‌బర్గ్ సిటీలో చక్కర్లు కొడుతున్నారు. సాల్జ్‌బర్గ్ వీధుల్లో ఉండే ఓ బొమ్మకు ప్రణీత కిస్ పెట్టారు. 

Also Read: Meenakshi Chaudhary Pics: బాబోయ్.. మీనాక్షి చౌదరి! కిలాడీ భామ అందాలకు కుర్రకారు బోల్డ్

Also Read: నవాజ్‌ వేసిన బంతి అలా పడుంటే.. వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని! అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News