టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి బ్యాట్ పట్టాడు. మైదానంలో బ్యాట్‌తో సిక్సు బాదుతుంటే.. స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వీరూ.. అప్పుడప్పుడు పరిమిత ఓవర్ల లీగ్‌లో కనువిందు చేస్తూ ఉన్నాడు. తాజాగా సెహ్వాగ్‌.. బెంగళూరు మైదానంలో షాట్‌లు కొట్టడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులో కర్ణాటక చలనచిత్ర కప్‌(కేసీసీ) పేరిట చిన్నస్వామి స్టేడియంలో ఇటీవలే రెండు రోజులు క్రికెట్ టోర్నమెంట్లు జరిగాయి. 10 ఓవర్ల ఈ మ్యాచ్‌లలో నటులు, కర్ణాటకకు చెందిన క్రికెటర్లతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. దక్షిణాది నటుడు కిచ్చా సుదీప్‌ కెప్టెన్‌గా ఉన్న కదంబ లయన్స్‌ జట్టులో సెహ్వాగ్‌ సభ్యుడు. దీనిలో భాగంగా ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ బ్యాట్‌తో పలు షాట్లు కొట్టాడు. ఓపెనర్‌గా దిగిన సెహ్వాగ్‌.. తొలి ఓవర్‌లోనే ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌ కొట్టి తన సత్తా చూపెట్టాడు. సెహ్వాగ్ స్టేడియంలో కొట్టిన షాట్లు మీరూ చూడండి..



 


2013 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన సెహ్వాగ్.. భారత జట్టు యొక్క అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరు. రెండు ఫార్మాట్లలో 16,859 పరుగులు చేసిన వీరూ.. 104 టెస్టులు, 251 వన్డేలు ఆడాడు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో వీరూ కీలక పాత్ర పోషించాడు.