West Indies T20I Squad against India: సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్‌ జట్టు త్వరలో భారత్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. భారత్, విండీస్ (IND Vs WI) వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనున్నాయి. ఇప్పటికే వన్డేల కోసం జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు.. శనివారం టీ20ల కోసం 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. విండీస్ జట్టుకు సీనియర్ ప్లేయర్ కీరన్‌ పొలార్డ్‌ (Kieron Pollard) కెప్టెన్‌ కాగా.. యువ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ వైస్‌ (Nicholas Pooran) కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్టిండీస్‌ టీ20 జట్టులో స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్ (Jason Holder) వంటి ప్లేయర్స్ ఉన్నారు. వీరందరూ ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నారు. భారత్, విండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుండగా.. 16 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. 16, 18, 20 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. అన్ని మ్యాచులు కోల్‌కతాలోనే రాత్రి 7.30 ప్రారంభం అవనున్నాయి. 


ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న వెస్టిండీస్‌.. 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టుతో ఆడుతున్న జట్టునే భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో కీరన్‌ పొలార్డ్‌ కెప్టెన్సీలోని విండీస్‌ సూపర్‌-12 దశలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో విండీస్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడి సూపర్‌-12 దశకు అర్హత సాధించాల్సి ఉంది.


వెస్టిండీస్ టీ20 జట్టు
కీరన్ పొలార్డ్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వైస్‌ కెప్టెన్‌), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షై హోప్, అకియెల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్, ఓడియన్ స్మిత్ షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్. 


Also Raed: U19 World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి.. ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరిన టీమిండియా!!


Also Read: Earthquake in Cricket: మ్యాచ్ జరుగుతుండగా..భూకంపం, మరి ఆటగాళ్లకు ఏమైందప్పుడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook