Netizens trolls BCCI for dropping Sanju Samson from Indian T20 squad: ఇంగ్లండ్ పర్యటన అనంతరం  వెస్టిండీస్‌ టూర్‌కు భారత్ వెళ్లనుంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం ఇదివరకే జట్టును ప్రకటించిన భారత్.. నేడు ఐదు టీ20ల సిరీస్‌ కోసం భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతిని ఇవ్వగా.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ చోటు దక్కించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు బీసీసీఐ సెలెక్టర్లు మొండిచేయి చూపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 కోసం అతను జట్టులో భాగమయ్యాడు కానీ తుది జట్టులో మాత్రం లేడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండవ టీ20లో 77 పరుగులతో రాణించాడు. అంతకుముందు ఐపీఎల్ 2022లో బ్యాటర్, కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టును ఏకంగా ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయినా కూడా సంజూకు వెస్టిండీస్‌తో టీ20ల్లో ఆడే అవకాశం దక్కకపోవడం విశేషం. 


భారత జట్టులో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా సంజూ శాంసన్‌ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా అతడిపై బీసీసీఐ శీతకన్ను వేస్తూనే ఉంది. వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన వెంటనే సంజూ శాంసన్ పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్లోకి వచ్చింది. బీసీసీఐ సెలెక్షన విధానాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మీమ్స్, కెమెంట్స్ పెడుతూ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మిగతా వికెట్ కీపర్ల కంటే సంజూ ఎక్కువ రన్స్ చేయడం తప్పా', 'సంజూని ఎందుకు ఎంపిక చేయలేదో బీసీసీఐ సమాధానం చెప్పాల్సిందే' అంటూ డిమాండ్ చేస్తున్నారు. 


సంజూ శాంసన్‌ 2015లో భారత జట్టులోకి వచ్చాడు. ఈ ఏడు ఏళ్లలో అతడికి వచ్చిన అవకాశాలు 14 మ్యాచులు మాత్రమే. 2015 జూలైలో జింబాబ్వేపై ఒక మ్యాచ్.. 2020 జనవరిలో శ్రీలంకపై 1 మ్యాచ్.. 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై 2 మ్యాచ్‌లు.. 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై 3 మ్యాచ్‌‌లు.. 2021 జూలైలో శ్రీలంకపై 3 మ్యాచ్‌‌లు.. 2022 ఫిబ్రవరిలో శ్రీలంకపై 2 మ్యాచ్‌‌లు.. 2022 జూన్‌లో ఐర్లాండ్‌పై 1 మ్యాచ్ ఆడాడు. 14 టీ20 మ్యాచులు కాకుండా.. భారత్ తరఫున 1 వన్డే ఆడాడు. 





Also Read: Regina Cassandra: రాత్రికి రాత్రే ప్రెగ్నెంట్ గా మారిన రెజీనా.. షాకింగ్ విషయం బయటకు


Also Read: IND vs WI T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. కోహ్లీ, బుమ్రా ఔట్‌! భారత్‌ జట్టు ఇదే  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook