Earthquake: క్రికెట్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠత. ఏ బాల్‌కు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ ఉత్కంఠ సమయంలో భూకంపం వస్తే..అది కూడా మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్‌లో. అదే జరిగింది. అప్పుడేమైంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ పోటీలు జరిగేటప్పుడు వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు, ఇసుక తుపానులు సహజమే. కానీ అదే మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్‌లో భూకంపం వస్తే. చాలా అసహజంగా ఉంటుంది కదా. అంతకుమించి భయం కలుగుతుంది. కానీ అదే జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా..అదే గ్రౌండ్‌లో భూమి కంపించింది. కెమేరాలు కాస్సేపు కదిలిపోయాయి. మ్యాచ్ కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు. కెమేరాలు, కూర్చున్న చోట ప్రకంపనలు రావడంతో తొలుత భూకంపమా అంటూ ఫన్నీగా మాట్లాడారు. అంతలో తేరుకుని కంగారు పడ్డారు. ఇంత జరుగుతున్నా..గ్రౌండ్‌లో ఆటగాళ్లకు ఏం తెలియలేదు. అంతలా ఆటలో లీనమైపోయారు మరి.



వెస్టిండీస్‌లోని ( West Indies) పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ (ICC U 19 World Cup) జరుగుతోంది. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మధ్. ప్లే ఆఫ్ మ్యాచ్ ఇది.  జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఆరవ ఓవర్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా భూమి కంపించింది. కెమేరాలు అటూ ఇటూ కదిలిపోయాయి.కెమేరాలో గ్రౌండ్ స్క్రీన్ అటూ ఇటూ కదిలిపోయి స్పష్టంగా కన్పించింది. కెమేరా స్క్రీన్‌పై ప్రకంపన స్పష్టంగా కన్పించినా..గ్రౌండ్‌లోని ఆటగాళ్లు మాత్రం ఆటలో లీనం కావడంతో ఏం తెలియలేదు. కామెంటేటర్లు భూకంపం (Earthquake) అంటూ ఫన్నీగా మాట్లాడినా..అంతలోనే కోలుకుని కంగారుపడ్డారు. దాదాపు 20 సెకన్ల పాటు కంపించింది. ప్రత్యక్ష ప్రసారం కోసం అమర్చిన లైవ్ కెమేరా స్పష్టంగా కదులుతూ కన్పించింది. కామెంటరీ బాక్స్ కంపించింది.



కాస్పేటికి ఐర్లాండ్ క్రికెట్ కూడా ట్రినిడాడ్ సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని ట్వీట్ ద్వారా ధృవీకరించింది. మ్యాచ్ జరుగుతుండగా..అదే గ్రౌండ్‌లో భూకంపం రావడం ఇదే తొలిసారి కావచ్చు. గతంలో ఇలా జరిగిన పరిస్థితి లేదు. ఇంత జరిగినా గ్రౌండ్‌లో ఆటగాళ్లకు ఏం తెలియకపోవడం విశేషం. క్రికెట్ అంటే అంతే మరి. లీనం చేసేస్తుంది. 


Also read: U19 World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి.. ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరిన టీమిండియా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook