Sports Stars to Ayodhya: అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్టాపన కార్యక్రమానికి క్రీడా ప్రముఖులు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్‌, చెస్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌తో పాటు వివిధ ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లు, అథ్లెట్లకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే వారికి రామతీర్థ ట్రస్ట్‌ నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. కొందరు క్రీడా ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన జరుగనున్న అయోధ్య ఉత్సవానికి ఎవరెవరు వస్తున్నారని క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలనాటి క్రీడా దిగ్గజాల నుంచి నేటి కుర్ర, యువ ఆటగాళ్ల వరకు అందరూ తరలివస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాణ ప్రతిష్ట వేడుకకు క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌, భారత క్రికెట్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని, ఇక చెస్‌ రారాజు విశ్వనాథన్‌ ఆనంద్‌ హాజరవుతారని సమాచారం. ఈ వేడుకలో పరుగుల వీరుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, దిగ్గజ ఆటగాడు సౌరవ్‌ గంగూలీ కూడా భాగమవుతారని తెలుస్తోంది. ఒలింపిక్ పతక విజేత, స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా, వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి, ఫుట్‌బాల్‌ ఆటగాడు కల్యాణ్‌ చౌబే, ప్రముఖ అథ్లెట్‌ కవిత రౌత్‌ తుంగర్‌, పారా ఒలింపిక్‌ జావెలిన్‌ థ్రోయర్‌ దేవేంద్ర జంజదియాలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. భారత మహిళా క్రికెట్‌ సారథి మిథాలీ రాజ్‌, స్టార్‌ షట్లర్స్‌ సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు కూడా ట్రస్ట్‌ ప్రతినిధులు ఆహ్వానాలు పంపారు.


అలనాటి క్రికెట్‌ దిగ్గజాలు కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రవీంద్ర జడేజా, గౌతమ్‌ గంభీర్‌, ప్రస్తుత భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా అయోధ్యకు వచ్చే వారి జాబితాలో ఉన్నారు. పరుగుల రాణి పీటీ ఉషా, ఫుట్‌బాల్‌ క్రీడాకారులు బైచుంగ్‌ భుటియా తదితరులు కూడా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తరలివస్తారని సమాచారం. తరలివస్తున్న క్రీడా తారల కోసం అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఆలయానికి వచ్చిన క్రీడా తారలను ఆలయ ట్రస్ట్‌ ప్రత్యేకంగా పూజ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.

Also Read Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్


Also Read Buy to Bike with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook